కాంగ్రెస్ తోనే పేద ఆర్యవైశ్యులకు న్యాయం

by Disha Web Desk 15 |
కాంగ్రెస్ తోనే పేద ఆర్యవైశ్యులకు న్యాయం
X

దిశ గజ్వేల్/కొండపాక : ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ చైర్మన్ కాల్వ సుజాత పేర్కొన్నారు. శుక్రవారం గజ్వేల్ లో నిర్వహించిన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. డీసీసీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి, రాష్ట్ర మాజీ కార్పొరేషన్లు చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, మడుపు భూంరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ తో కలిసి ఆమె మాట్లాడుతూ గతంలో ఆర్యవైశ్యులు శ్రీమంతులు కాగా, ప్రస్తుతం 80 శాతం మంది పేదరికాన్ని అనుభవిస్తున్నట్లు స్పష్టం చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు హామీ ఇచ్చి విస్మరించడంతో ఆగ్రహించిన ఆర్యవైశ్యులు రాష్ట్ర వ్యాప్తంగా ఓటుతో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పినట్లు తెలిపారు. అవినీతి, అక్రమాలతో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆగర్బ శ్రీమంతులు కాగా,

మధ్యతరగతి ప్రజలు, పేదలు మరింత పేదరికంలో కూరుకుపోయినట్లు చెప్పారు. 11 ఏళ్ల పోరాటం ఫలితంగా వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు కాగా పట్టుబట్టి మేనిఫెస్టోలో ప్రకటింపజేసి అధికారం చేపట్టిన వెంటనే అమలు చేసినట్లు గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో పేద ఆర్యవైశ్యుల అభివృద్దికి మార్గం ఏర్పడగా, అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలనే లక్ష్యంతో 36 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ సర్కార్ కే దక్కించుకున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు తీవ్ర అన్యాయం జరిగిందని, అభద్రతా భావం ఉండేదని అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్యవైశ్యులు బయట చెప్పరని,

న్యాయంగా వ్యాపారం చేసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పారు. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి, ఆర్యవైశ్య సంఘం మహాసభ జిల్లా అధ్యక్షుడు కాచం నవీన్ గుప్త, నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, సిద్ది భిక్షపతి, అత్తెల్లి లక్ష్మయ్య గుప్త, మల్యాల భద్రయ్య గుప్త, తోట భిక్షపతి గుప్త, సూర ఆంజనేయులు గుప్త, మహేందర్ గుప్త, వెంకటయ్య గుప్త, హరినాథ్ గుప్త, రంగయ్య గుప్త, బాలేశ్ గుప్త, ఎర్రం శ్రీనివాస్ గుప్త, జగ్గయ్యగారి శేఖర్ గుప్త, నవీన్ గుప్త, ఉమేష్ గుప్త, కొండలు, అశోక్, ప్రశాంత్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed