పేట జిల్లా ఉంటుందా.. ఉండదా? స్పష్టమైన హామీ ఇవ్వాలి.. : మాజీ ఎమ్మెల్యే

by Disha Web Desk 23 |
పేట జిల్లా ఉంటుందా.. ఉండదా? స్పష్టమైన హామీ ఇవ్వాలి.. : మాజీ ఎమ్మెల్యే
X

దిశ,నారాయణపేట ప్రతినిధి: నారాయణపేట జిల్లా ఉంటుందా.. ఉండదా... జిల్లాలు తీసివేసేందుకు కమిటీ వేశామని పత్రికల్లో వస్తుందని ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట ఎమ్మెల్యేకి స్పష్టమైన హామీ ఇవ్వాలని... నారాయణపేట నియోజకవర్గం లో కొత్త మండలాల ఏర్పాటు ఏమయ్యిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బెదిరింపు రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం నిర్మాణం కోసం టెండర్ ప్రక్రియ ఎందుకు రద్దయింది? మరికల్ మండల కాంప్లెక్స్ నిర్మాణ పనులు ఎందుకు ఆగిపోయాయో సమాధానం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే పాత తెలంగాణగా కరెంటు కోతలు, తాగునీటి ఇబ్బందులు,రైతులకు పెట్టుబడి సహాయం అందక ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా రద్దు చేస్తామని పత్రికలో వచ్చిన నిర్ణయం పై స్పష్టమైన వైఖరి ప్రజలకు తెలియజేయాలన్నారు.

జిల్లా రద్దు చేయడానికి పూనుకుంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమిస్తామన్నారు. జిల్లా ఏర్పాటు అయినందుకే ఎంతోమంది కోట్లు పెట్టి భూములు కొన్నారని, అలాగే వ్యాపారులు కాంప్లెక్సులు నిర్మించుకున్నారన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి విజయం సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల వద్దకు వెళ్తే తప్పు చేశామని పశ్చాత్తాప పడుతున్నట్లు తమతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడం వల్ల రైతులు అయోమయ పరిస్థితిలో ఉన్నారని వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. వేపూరి రాములు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed