ప్రజా సంక్షేమమే బీజేపీ ధ్యేయం : భరత్ ప్రసాద్

by Disha Web Desk 23 |
ప్రజా సంక్షేమమే బీజేపీ ధ్యేయం :  భరత్ ప్రసాద్
X

దిశ,‌గద్వాల: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ అని నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల విజయ సంకల్ప యాత్రలో భాగంగా శుక్రవారం గద్వాల్ నియోజకవర్గంలో మల్దకల్, గట్టు, కేటిదొడ్డి ధరూర్ మండలాలో జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా మల్దకల్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మల్దకల్ మండలం అమరవాయి, మద్దెల బండ, గట్టు మండలం మాచర్ల బల్గేర, కేటి దొడ్డి మండలం కుచినెర్ల, చింతలకుంట, నందిన్నె, కేటిదొడ్డి, అల్వాల్ పాడు, ధరూర్ మండల కేంద్రంతో పాటు తదితర గ్రామాల్లో విజయ సంకల్ప యాత్ర కొనసాగింది. ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ మాట్లాడుతూ

ఈసారి కూడా కేంద్రంలో మోదీ సర్కారే అధికారంలోకి రానుందని తెలిపారు . అయోధ్యలో రాముని ఆలయం ప్రారంభంతో మోదీకి దేశ ప్రజల ఆశీస్సులు లభించాయన్నారు. యువతకు శిక్షణ, ఉపాధి, మహిళలకు ఉజ్వల, రైతులకు ఆర్థిక భరోసాతో కేంద్ర ప్రభుత్వం పేదల అభివృద్ధికి కృషిచేస్తోందని అన్నారు. బీజేపీ అభ్యర్థులకు వేసే ప్రతి ఓటు ప్రధాని మోదీకే వెళ్తోందని, ఆయన్ను మూడోసారి ప్రధానిగా ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని‌ నరేంద్ర మోడీ యువకులను రాజకీయాల్లో ప్రోత్సహించాలని ఉద్దేశంతో నాగర్ కర్నూల్ అభ్యర్థి గా అవకాశం ఇచ్చారన్నారు. మీరు ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తే మోడీ సహకారంతో మన మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు.

నరేంద్ర మోడీని గెలిపిస్తే దేశం సురక్షితంగా ఉంటుందన్నారు. నరేంద్ర మోడీ గారు 80 కోట్ల మందికి ఆహార భద్రత ద్వారా ఉచిత రేషన్ ఇస్తున్నారన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించారన్నారు. మహిళలకు చట్టసభల్లో పార్లమెంట్, అసెంబ్లీ 33% రిజర్వేషన్లు నరేంద్ర మోడీ కల్పించాలన్నారు. చిరు వ్యాపారాలు చేసుకునేవారికి ముద్ర యోజన ద్వారా 10 లక్షల నుంచి 20 లక్షల వరకు రుణాలు పెంచారన్నారు. మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల పోరాటం సఫలీకృతం కాబోతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం బిజెపి పార్టీ కట్టుబడిందన్నారు.

దళితుల సమగ్ర అభివృద్ధికి మోడీ గ్యారెంటీ ఇచ్చారన్నారు. మీరంతా ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తుపై ఓట్లు వేసి నన్ను గెలిపిస్తే ఎస్సీ వర్గీకరణ కోసం పార్లమెంట్లో మాట్లాడి చట్టం అమలు కావడంలో భాగస్వామ్యం అవుతానన్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు మాయ మాటలు చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారని అలాంటి మాయ మాటలను నమ్మకుండా బీజేపీని గెలిపించాలని వారు కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి గద్వాల్ నియోజకవర్గం బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed