సర్కారి దావఖానలో ఎమ్మెల్యే తండ్రికి శస్త్రచికిత్స

by Disha Web Desk 11 |
సర్కారి దావఖానలో ఎమ్మెల్యే తండ్రికి శస్త్రచికిత్స
X

దిశ,ఆదిలాబాద్ : 'నేను రాను బిడ్డో సర్కారు దావఖానకు' అనేది ఒకప్పటి మాట..కానీ సర్కారి దావఖానలే పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తాయని ప్రజల్లో నమ్మకం కలిగించి, ప్రజల దృష్టిని సర్కారు దావఖానాల వైపు మల్లించడంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ముందు వరుసలో ఉన్నారు. తనకు జబ్బు చేస్తే స్వయంగా సర్కారు దావఖానకు వెళ్లి వైద్యం చేయించుకున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, తన తండ్రిని కూడా సర్కారు ఆస్పత్రిలో చేర్పించి తన నిబద్ధతను చాటుకొన్నారు. వెడ్మ బొజ్జు తన తండ్రి వెడ్మ భీంరావు దవడ కు క్యాన్సర్ అయి... గత కొన్ని రోజులుగా బాధపడుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న ఆయన శుక్రవారం తన తండ్రిని ధైర్యంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు. అంతకుముందు క్యాన్సర్ వ్యాధికి స్పెషలిస్ట్ అయినా డాక్టర్ జక్కుల శ్రీకాంత్ తో పాటు,రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ లతో మాట్లాడి డాక్టర్లు ఇచ్చిన దైర్యం తో అక్కడే శస్త్ర చికిత్స చేయించారు. అంకలాజి డాక్టర్లు విజయవంతంగా ఎమ్మెల్యే తండ్రికి ఆపరేషన్ చేశారు. ఎమ్మెల్యే తండ్రి ప్రస్తుతం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు సాయంత్రం రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని చేరుకున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆస్పత్రిలో ఉన్నా తండ్రిని పరమార్శించి వైద్య చికిత్సపై పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కారు ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు తన తండ్రికి సర్కారు ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించానని అన్నారు. చిన్న చిన్న రోగాలకు చికిత్స కోసం కార్పొరేట్ అస్పత్రులకు వెళ్లి ప్రజలు ఆర్థిక సమస్యలు కొని తెచ్చుకోవద్దని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన వైద్య సదుపాయాలు కల్పిస్తుందని అన్నారు. అధునాతన హంగులతో సుమారు రెండు వందల కోట్ల రూపాయలతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి తలమానికంగా నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం ఉందని, ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి తమ డబ్బులు వృధా చేసుకోవద్దని కోరారు.

Next Story

Most Viewed