ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ హల్‌చల్

by Disha Web Desk 23 |
ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ హల్‌చల్
X

దిశ, ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ ఆదిలాబాద్ ఇంచార్జ్ డీఎస్పీ రమణమూర్తి హల్ చల్ చేశారు. జిల్లాలోని నాలుగు వరుసల రహదారి నిర్మాణం లో భూములు కోల్పోయిన బాధితులకు నష్ట పరిహారం అందించడం అప్పటి ఆసిఫాబాద్ ఆర్డీవో భారీగా అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అలాగే అప్పటి ఆర్డీవో దత్తు తో కలిసి పని చేసిన డీటీ నాగోరావు, ఎంసీ భారత్ ల సైతం ప్రాథమికంగా విచారించి, హైవే భూములు కోల్పోయిన లబ్ధిదారులకు సంబంధించిన కీలక వివరాలను సేకరించి డీఎస్పీ తన వెంట తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆసిఫాబాద్ ఆర్డీవో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే దత్తు పై అవినీతి ఆరోపణలు రావడంతో సెలవు పెట్టిన వెళ్లినట్లు సమాచారం.



Next Story

Most Viewed