నంబూరు మధు సేవలు చిరస్మరణీయం

by Disha Web Desk 15 |
నంబూరు మధు సేవలు చిరస్మరణీయం
X

దిశ, వైరా : అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజ అభివృద్ధికి లయన్స్ క్లబ్ వైస్ డిస్టిక్ గవర్నర్-2 నంబూరు మధుసూదన్ రావు విశేష కృషి చేశారని, ఆయన సేవలు చిరస్మరణీయమని లయన్స్ క్లబ్ ప్రతినిధులు కొనియాడారు. వైరాలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పెనుగొండ ఉపేంద్రరావు అధ్యక్షతన నంబూరు మధు సూదన్ రావు సంస్మరణ సభను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి లయన్స్​ క్లబ్ ప్రతినిధులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ తీగల మోహన్ రావు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు మధు ఎంతటి ఖర్చు అయినా తానే భరించేవారని గుర్తు చేశారు. జిల్లా గవర్నర్ సిహెచ్వి శివప్రసాద్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ల అభివృద్ధికి మంచి సూచనలు ఇచ్చి సేవా కార్యక్రమాలను విజయవంతం చేసేవారని తెలిపారు. మల్టిపుల్ జీఎస్టీ కోఆర్డినేటర్ గోలి అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి నుంచి నిర్వహించే ప్రతి సేవా కార్యక్రమాన్ని నంబూరు మధు సేవా కార్యక్రమంగా భావించాలని క్లబ్ సభ్యులకు పిలుపునిచ్చారు. పర్మినెంట్ ప్రాజెక్టుగా ఆయన పేరుతో లయన్

భవన్ నిర్మించాలని అందుకు తామంతా సహకరిస్తామని స్పష్టం చేశారు. పీజీజీ డాక్టర్ కాపా మురళి కృష్ణ మాట్లాడుతూ క్లబ్ లో ప్రతి విషయాన్ని ఒక ప్రణాళిక ప్రకారం చేసేవారని మంచి మంచి కార్యక్రమాలు చేయడంలో ఆయన సఫలీకృతులయ్యారని వివరించారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ గవర్నర్ ఎలెక్ట్ ఏరాల ప్రభాకర్ రెడ్డి, వైస్ డిస్టిక్ గవర్నర్ 2 ఎలెక్ట్ కేవీ ప్రసాద్, పీడీజీ లు అమృతపల్లి కోటేశ్వరరావు, డాక్టర్ యారాల మోహన్ రెడ్డి, దారా కృష్ణారావు, మోత్కూరి మురళీధర్ రావు, డాక్టర్ ఆర్ రాఘవరెడ్డి, డాక్టర్ ఎన్. బాలయ్య, వెంపటి లక్ష్మీనారాయణ, దశరథ్ జేల్లా, డీసీఎస్ సాతులూరు సత్యనారాయణ, జీఎంటీ కోఆర్డినేటర్ ఉండ్రు శ్యాంబాబు, రీజన్ చైర్మన్ లగడపాటి ప్రభాకర్ రావు, అశోక్ రెడ్డి, చలపతిరావు, చింత నిప్పు వెంకటయ్య, వనమా విశ్వేశ్వరరావు, డాక్టర్ పెరుమాళ్ళ కృష్ణమూర్తి ,పాయల నాగేశ్వరరావు, క్లబ్ కోశాధికారి చింతలపూడి వెంకటేశ్వరరావు, మీల్స్ అండ్ వీల్స్ కోఆర్డినేటర్ చింతోజు నాగేశ్వరరావు, కార్యదర్శి అబ్బురి రమేష్, వై బుచ్చి రామారావ్, దారా శ్రీనివాసరావు, కొత్తూరు ప్రభాకర్ రావు, డాక్టర్ పూర్ణచంద్రరావు, కర్నాటి లక్ష్మారెడ్డి, ధారా విష్ణు మోహన్ రావు, గజ్జల కృష్ణమూర్తి, నూకల ప్రసాద్ , వాసు, తాడికొండ రాము, కొల్ల రాంబాబు తదితరులు పాల్గొని నివాళులు అర్పించి ఆయన సేవలను కొనియాడారు.

Next Story

Most Viewed