Youtubeకు పోటీగా ఎలాన్‌మస్క్ ‘ఎక్స్’ టీవీ యాప్

by Disha Web Desk 17 |
Youtubeకు పోటీగా ఎలాన్‌మస్క్ ‘ఎక్స్’ టీవీ యాప్
X

దిశ, టెక్నాలజీ: టెస్లా అధినేత ఎలాన్‌మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసి ఎక్స్‌గా మార్చిన తరువాత దానిలో చాలా అప్‌డేట్‌లు తీసుకొచ్చారు. ఈ యాప్‌ను ఆల్ ఇన్ వన్‌గా మారుస్తానని మస్క్ గతంలోనే ప్రకటించారు. దానికి అనుగుణంగా కీలక నిర్ణయాలను వెంట వెంటనే తీసుకుంటున్నారు. త్వరలో YouTube కు పోటీగా వీడియోలను చూడటానికి అనువుగా ఉండే ‘ఎక్స్’ టీవీ యాప్‌ను సైతం తీసుకువస్తామని కంపెనీ తెలిపింది. ఎక్స్ సీఈవో లిండా యాకరినో తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించారు. త్వరలో మేము X టీవీ యాప్‌తో మీ స్మార్ట్ టీవీలకు సరికొత్త, ఆకర్షణీయమైన కంటెంట్‌ను తీసుకువస్తాము. పెద్ద స్క్రీన్‌పై అత్యంత నాణ్యత కలిగిన, లీనమయ్యే కంటెంట్ అందిస్తామని, చిన్న స్క్రీన్ నుంచి పెద్ద స్ర్కీన్ వరకు ఎక్స్ అన్నింటిని మార్చేస్తుందని X సీఈఓ చెప్పారు.

దీనిలో వీడియోల ఫార్మాట్ మొత్తం కూడా YouTube లాగా ఉంటుంది. అధిక-నాణ్యత వీడియోలను చూడవచ్చు. AI-ఆధారిత ఫీచర్లు సైతం ఈ యాప్‌లో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ట్రెండింగ్ వీడియోలు, మెరుగైన సెర్చింగ్, కేటగిరీల వారిగా వీడియోలను ఈ యాప్‌లో అందించనున్నారు. ప్రస్తుతానికి ఎక్స్ టీవీ యాప్‌ను తయారుచేసే ప్రక్రియ చివరి దశకు వచ్చింది. పూర్తి స్థాయిలో పరీక్షలు చేశాక మార్కెట్లోకి విడుదల చేస్తారు. ఈ యాప్ అందుబాటులోకి వస్తే గనక Youtube‌కు గట్టి పోటీ ఇస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

Click Here for Twitter video link



Next Story

Most Viewed