కువైట్ తో కీలక పోరు.. భువనేశ్వర్ లో ఫుట్ బాల్ టీం సన్నాహక శిబిరం

by Dishanational6 |
కువైట్ తో కీలక పోరు.. భువనేశ్వర్ లో ఫుట్ బాల్ టీం సన్నాహక శిబిరం
X

దిశ, స్పోర్ట్స్: ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ రెండో రౌండ్ లో కువైట్ తో భారత జట్టు కీలకపోరు జరగనుంది. జూన్ 2న కువైట్- భారత్ మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ జరగనుంది. అయితే, దాని కోసం సన్నాహాలకు సిద్ధమైంది భారత జట్టు. ఒడిశాలోని భువనేశ్వర్ లో నాలుగువారాల సన్నాహక శిబిరంలో భారత ఫుట్ బాల్ టీం పాల్గొననుంది. మే 10 నుంచి శిబిరం స్టార్ట్ కానుంది. ఈ విషయాన్ని ఏఐఎఫ్ఎఫ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా ప్రకటించింది.

గ్రూప్ దశలోని చివరి మ్యాచ్ కోసం తుది జట్టు కోల్ కతా వెళ్లనున్నట్లు ఏఐఎఫ్ఎప్ ప్రకటించింది. కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో గ్రూప్ దశలోని చివరి మ్యాచ్ లో కువైట్ తో తలపడనుంది భారత టీం. ఇకపోతే, అఫ్గాన్ తో జరిగిన లాస్ట్ మ్యాచ్ లో భారతో ఘోర ఓటమిని చవిచూసింది. ఆ ఓటమి నుంచి సునీల్ ఛెత్రి టీం తిరిగి పుంజుకోవాలని చూస్తుంది.

ఆరు మ్యాచ్‌ల తర్వాత కేవలం రెండు దేశాలు మాత్రమే మూడో రౌండ్‌కు చేరుకుంటాయి. భారత్ ప్రస్తుతం నాలుగు పాయింట్లతో గ్రూప్‌ దశలో రెండో స్థానంలో ఉంది. కేవలం గోల్ తేడాతోనే అఫ్గాన్ కంటే ఒక్క పాయింట్ తేడాతోనే భారత్ ముందుంది. ఫైనల్ మ్యాచ్ కోసం ఖతార్ వెళ్లేముందు.. నాలుగో స్థానంలో ఉన్న కువైట్ తో మ్యాచ్ ఆడనుంది సునీల్ ఛెత్రి టీం.



Next Story

Most Viewed