అమిత్‌షా ఫేక్ వీడియో కేసు.. అరుణ్ రెడ్డికి ఒకరోజు కస్టడీ

by Dishanational6 |
అమిత్‌షా ఫేక్ వీడియో కేసు.. అరుణ్ రెడ్డికి ఒకరోజు కస్టడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: సంచలనం సృష్టించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఫేక్‌ వీడియో కేసులో అరుణ్ రెడ్డికి ఒకరోజు కస్టడీ విధించింది ఢిల్లీ కోర్టు. ఢిల్లీ డ్యూటీ మెజిస్ట్రేట్ నేహా గార్గ్ ఎదుట అరుణ్ రెడ్డిని హాజరుపరిచారు ఢిల్లీ పోలీసులు. కాగా.. 14 రోజుల కస్టడీ కావాలని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కోరగా..కోర్టు ఒకరోజు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. మరోవైపు అరుణ్ రెడ్డి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులకు నోటీసులు ఇచ్చింది కోర్టు. మరోవైపు బెయిల్ కేసులో మంగళవారం వాదనలు విననుంది.

అమిత్ షా ఫేక్ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈకేసులో తెలంగాణకు చెందిన అరుణ్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఎక్స్‌లో ‘స్పిరిట్‌ ఆఫ్‌ కాంగ్రెస్‌’ ఖాతాను కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా జాతీయ కన్వీనర్‌ అరుణ్‌రెడ్డి నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్‌ ప్యూజన్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ ఆపరేషన్స్‌ అధికారులు అరెస్టు ఆయన్ని అరెస్టు చేశారు. మరోవైపు, అరుణ్ రెడ్డిపై అల్లర్లు సృష్టించడం, రెచ్చగొట్టడం, ఐటీ చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు.

Next Story

Most Viewed