అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

by Mamatha |
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
X

దిశ,తుని: దారుణమైన ఘటన చోటుచేసుకుంది. శరీరంపై దుస్తులు లేకుండా అనుమానాస్పద స్థితిలో ఉన్న మహిళ మృతదేహం కలకలం రేపుతుంది. ఆ మహిళ చేతులు, కాళ్లు ప్లాస్టిక్ టేపుతో కట్టేసారు. ఈ హృదయ విదారకర ఘటన కాకినాడ జిల్లా తుని మండలం రాజుల కొత్తూరు వద్ద చోటుచేసుకుంది. దీనిపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు అతికిరాతకంగా అత్యాచారం అనంతరం చంపేసి ఇక్కడ పడేసి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు.

Next Story