బండ్లగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ముగ్గురు మృతి

by Disha Web Desk 19 |
బండ్లగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ముగ్గురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని బండ్లగూడ సన్ సిటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం ఓవర్ స్పీడ్‌తో ఓ కారు మార్నింగ్ వాకర్స్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు.. మరో చిన్నారి మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవ్ చేస్తోన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద పోలీసులు మారణాయుధాలు గుర్తించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed