మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన జొమాటో.. ఇకనుంచి వారికీ ఫ్రీ డెలివరీ

by  |
మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన జొమాటో.. ఇకనుంచి వారికీ ఫ్రీ డెలివరీ
X

దిశ, ఫీచర్స్: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జోమాటో తన యూజర్లకు మరో బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. అయితే ఇప్పటికే ప్రో పేరిట మెంబర్‌షిప్‌ను అందుబాటులోకి తెచ్చిన కంపెనీ.. ప్రస్తుతం ప్రో సభ్యత్వంలో భాగంగా రూ. 200 మెంబర్‌షిప్‌ను తీసుకుంటే ఫుడ్‌ డెలివరీలపై 30 శాతం వరకు అదనపు తగ్గింపు, రెస్టారెంట్‌ డైనింగ్‌లో 40 శాతం వరకు తగ్గింపుతో పాటు వేగవంతమైన డెలివరీలను అందిస్తోంది. ఈ మెంబర్‌షిప్‌ గడువు 90 రోజులుగా ఉంటుంది. దీనికి మరిన్ని ఆఫర్స్ జోడిస్తూ ‘ప్రో ప్లస్ ప్లాన్’ తీసుకొచ్చింది.

జోమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ ప్రో ప్లస్ మెంబర్‌షిప్‌ను ప్రారంభిస్తున్నట్లు ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. ఇది ఇన్‌వైట్- ఓన్లీ సర్వీస్ అని కూడా పేర్కొనగా, యాప్‌ను ఎక్కువగా వినియోగించే వారికి లేదా ప్రో మెంబర్‌షిప్ ఉన్నవారికి ఇది అందుబాటులో ఉండవచ్చు. అందువల్లే పరిమిత సంఖ్య వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ తమ యాప్‌లో కనిపిస్తుంది. ఇక 12 నెలల జోమాటో ప్రో ప్లస్ ప్లాన్‌ తీసుకోవాలనుకుంటే రూ. 900 పే చేయాలి. 3 నెలల ప్లాన్ ధర రూ. 300. ఈ మెంబర్‌షిప్ వల్ల అపరిమిత ఉచిత డెలివరీలతో పాటు ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. సర్జ్ ఫీ కూడా ఉండదు.

“మేము దీన్ని ప్రతిరోజూ ఎంతోమంది వినియోగదారులకు అందిస్తున్నాం. మీరు ప్రో మెంబర్ అయితే, జోమాటోలో ఆర్డర్ చేయడం కొనసాగించండి. ప్రో ప్లస్‌కు అర్హత సాధించినట్లయితే మీకు మా నుంచి ఆహ్వానం అందుతుంది. ఉచిత అపరిమిత డెలివరీ కాకుండా, వినియోగదారులు జోమాటో ప్రో సభ్యత్వ ప్రయోజనాలను కూడా పొందుతారు” అని కంపెనీ తెలిపింది.



Next Story