ప్లాస్మా థెరపీ: బ్లడ్ డొనేట్ చేసిన బాలీవుడ్ నటి

by  |
ప్లాస్మా థెరపీ:  బ్లడ్ డొనేట్ చేసిన బాలీవుడ్ నటి
X

జోయా మొరాని కరోనాను జయించిన బాలీవుడ్ నటి. తను కోలుకునేందుకు వైద్యులు, సిబ్బంది చాలా శ్రమించారని ధన్యవాదాలు తెలిపిన ఆమె.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ప్లాస్మా థెరపీ కి బ్లడ్ డొనేట్ చేసింది. ముంబై లోని నయర్ హాస్పిటల్ లో రక్తదానం చేసిన ఆమె.. కరోనా నుంచి కోలుకున్న ప్రతీ ఒక్కరూ ఇతరులు ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు రక్తదానం చేయాలని కోరింది. మీరు భయపడాల్సిన అవసరం లేదని.. సిబ్బంది చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారని.. మీ రక్తదానం మరొకరి ప్రాణదానం గుర్తుంచుకోవాలని కోరింది. ఇండియా త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపింది జోయా.

కాగా జోయా మొరాని తండ్రి కరీం మోరాని తో పాటు సోదరి షాజా మొరానికి కూడా కరోనా పాజిటివ్ రాగా కోలుకున్నారు. షారుఖ్ ఖాన్ చెన్నై ఎక్స్ప్రెస్ నిర్మాత కరీం మొరాని బాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ హిట్స్ నిర్మించారు.

Next Story

Most Viewed