అప్పట్లో సోషల్ మీడియా ప్రభావం లేదు : యువీ

by  |
అప్పట్లో సోషల్ మీడియా ప్రభావం లేదు : యువీ
X

టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మధ్య తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర చర్చ జరిగింది. ఈ క్రమంలో అప్పటి జట్టుకు, ఇప్పటి జట్టుకు తేడా ఏమిటని రోహిత్ అడిగిన ప్రశ్నకు యువీ బదులిస్తూ.. ‘అప్పట్లో జట్టులో ఉన్న ప్రతి ఆటగాడిని సమాన స్థాయిలో చూసేవారు. ఆటగాళ్ళ మధ్య ఎలాంటి బేధాలు ఉండేవి కావు. పైగా సోషల్‌ మీడియా ప్రభావమూ అంతగా లేదు. మీడియాతో ఎలా మాట్లాడాలనే విషయాలను సీనియర్లను చూసే నేర్చుకున్నాం. అయితే ప్రస్తుతం ఆటగాళ్ళు సోషల్‌ మీడియాలో అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బందులకు గురవుతున్నారని.. హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌లు ఒక షోలో మహిళలపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశాడు. ఇటువంటి సంఘటనలేవీ తమ కాలంలో జరగలేదని’ తెలిపాడు.

రోహిత్‌ శర్మ కూడా ప్రస్తుతం యువ ఆటగాళ్ళతో మంచి సంబంధాలను కొనసాగిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా రిషబ్‌ పంత్‌ విషయంలో మీడియాలో తప్పుడు ప్రచారంపై చురకలంటించాడు. ఒక ఆటగాడి గురించి రాసే ముందు మీడియా నిజానిజాలు తెలుసుకోవాలని’ సూచించాడు.

Tags: Yuvraj singh, Rohit sharma, Seniors, Social Media, Instagram

Next Story

Most Viewed