హ్యూండాయ్ 10 లక్షల 'మేడ్ ఇన్ ఇండియా' ఎస్‌యూవీ అమ్మకాలు

by  |
హ్యూండాయ్ 10 లక్షల మేడ్ ఇన్ ఇండియా ఎస్‌యూవీ అమ్మకాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆటో తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్) దేశీయంగా తయారైన ‘మేడ్ ఇన్ ఇండియా’ ఎస్‌యూవీల అమ్మకాల్లో 10 లక్షల మార్కును దాటినట్టు సోమవారం వెల్లడించింది. స్థానికంగా తయారైన ఈ ఎస్‌యూవీలను దేశీయంగానే కాకుండా ఎగుమతులు కూడా చేసినట్టు హ్యూండాయ్ మోటార్ ఇండియా లింటెడ్(హెచ్ఎంఐఎల్) ఓ ప్రకటనలో పేర్కొంది. 2015లో ప్రారంభించినప్పటి నుంచి తమ మిడ్-సైజ్ ఎస్‌యూవీ క్రెటా దేశీయ మార్కెట్లో ఇప్పటివరకు 5.9 లక్షల యూనిట్లు, ఎగుమతి మార్కెట్లో 2.2 లక్షల యూనిట్లకు పైగా అమ్మకాలు నమోదయ్యాయని హెచ్ఎంఐఎల్ తెలిపింది.

అదేవిధంగా 2019లో మార్కెట్లోకి తీసుకొచ్చిన వెన్యూ మోడల్ ఇప్పటివరకు 1.8 లక్షల యూనిట్లను దేశీయ మార్కెట్లో అమ్ముడైనట్టు వెల్లడించింది. వెన్యూ, క్రెటాతో పాటు కంపెనీ తన ఎస్‌యూవీ విభాగంలో టక్సన్, ఎలక్ట్రిక్ వాహనమైన కోనా మోడళ్లను కలిగి ఉంది. త్వరలో 7-సీటర్ ఎస్‌యూవీ అల్కాజర్ మోడల్‌ను తీసుకురానుంది. ‘ దేశీయ, ఎగుమతి మార్కెట్లో 10 లక్షల ‘మేడ్ ఇన్ ఇండియా’ ఎస్‌యూవీలను విక్రయించడం రెండు దశాబ్దాలుగా భారత్‌తో ఉన్న కంపెనీ నిబద్ధతకు నిదర్శనమని’ హెచ్ఎంఐఎల్ సేల్స్, మార్కెటింగ్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ చెప్పారు.


Next Story