రోడ్ల మరమ్మతులకు మోక్షం ఎన్నడో..?

by  |
రోడ్ల మరమ్మతులకు మోక్షం ఎన్నడో..?
X

దిశ, హుజూర్ నగర్: ప్రమాదకరంగా మారిన హుజూర్ నగర్ రోడ్లకు మోక్షం ఎన్నడో అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆదెర్ల శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరమే రోడ్లు వేయించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆర్డీఓ వెంకారెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆదెర్ల మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని రోడ్లు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాయన్నారు. మఠంపల్లి మండలంలోని రోడ్లపై గుంతల వల్ల ఒకే రోజు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్ల మరమ్మతులపై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ స్పందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మిషన్ భగీరథ పైపులు వేయడానికి రోడ్లను త్రవ్వించిన కాంట్రాక్టర్లు మరమ్మతులు చేయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు రిపేరు చేయించడంలో అలసత్వం వహిస్తున్న కాంట్రాక్టర్ల లైసెన్సులు రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నున్న రామారావు, కందుల నర్సింహా రెడ్డి, తోట కోటి నాయుడు, శాసనాల అంజి నాయుడు, లింగరాజు, హాసన్,అహ్మద్, బ్రహ్మచారి, రాము, నాని తదితరులు పాల్గొన్నారు.

Next Story