వైఎస్ వివేకా హత్యకేసు: సమాచారమిస్తే రూ.5 లక్షలు బహుమానం

by  |
వైఎస్ వివేకా హత్యకేసు: సమాచారమిస్తే రూ.5 లక్షలు బహుమానం
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ కీలక ప్రకటన చేసింది. వివేకా హత్యకు సంబంధించి ఎవరైనా సమాచారం అందిస్తే వారికి రూ.5 లక్షలు రివార్డు ఇవ్వనున్నట్లు ఏకంగా పత్రికా ప్రకటన విడుదల చేసింది. అయితే నమ్మకమైన, ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలిపింది. ఈ హత్యకు గురించి సమాచారం తెలిసిన వారు ఎవరైనా సాధారణ ప్రజల నుంచి ఎవరైనా సమాచారం ఇచ్చేందుకు ముందుకు రావాలని కోరింది.

ఎవరివద్దనైనా ఖచ్చితమైన, నమ్మదగిన సమాచారం ఉంటే వారు సీబీఐ డీఎస్పీ దీపక్ గౌర్ (011-24368646, 9474256974), ఎస్పీ రామ్‌సింగ్ (011-24368649, 9988272709) లను కార్యాలయంలో కానీ, ఫోన్ ద్వారా కానీ సంప్రదించవచ్చని సీబీఐ ఆ ప్రకటనలో వెల్లడించింది. ఇకపోతే ఈ హత్యకేసుకు సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే 75 రోజులుగా అనుమానితులను విచారిస్తున్న సీబీఐ తాజాగా ఈ కీలక ప్రకటన చేసింది. కేసు దర్యాప్తు వేగవంతంగా జరుగుతున్న తరుణంలో ఖచ్చితమైన సమాచారం కోసం ఇలా పేపర్ ప్రకటన ఇచ్చినట్లు తెలుస్తోంది.

Next Story