TRS అంటే.. TAX రాష్ట్ర సమితి : షర్మిల ఫైర్

by  |
TRS అంటే.. TAX రాష్ట్ర సమితి : షర్మిల ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే.. పిచ్చోడి చేతిలో రాయిలా.. రేట్లను అడ్డగోలుగా పెంచి సామాన్యులపై పన్నుల భారం మోపుతున్నారని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల విమర్శలు చేశారు. పన్నుల పేరుతో కేసీఆర్ ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు, పన్నులు పెరిగిపోతుంటే.. సీఎంగా కేసీఆర్ ఉండి ఎందుకు.. వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

వైఎస్సార్ పాలనలో మున్సిపల్ పన్ను, కరెంట్ బిల్లులు, బస్ ఛార్జీలపై పైసా కూడా పెంచలేదని ఆమె గుర్తుచేశారు. కానీ, కేసీఆర్‌కు పరిపాలన చేతకాక విద్యుత్ సంస్థలను, ఆర్టీసీని నష్టాల్లో కూరుకుపోయేలా చేశారని ఆరోపించారు. నష్టాలను పూడ్చుకొనేందుకు ఇప్పుడు బస్ ఛార్జీలు, కరెంట్ బిల్లులు పెంచేందుకు రెడీ అయ్యారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదని.. టాక్స్ రాష్ట్ర సమితి అని చురకలంటించారు.


Next Story

Most Viewed