టిక్ టాక్ లాంటి ఫీచర్ యాడ్ చేయబోతున్న యూట్యూబ్

by  |
టిక్ టాక్ లాంటి ఫీచర్ యాడ్ చేయబోతున్న యూట్యూబ్
X

దిశ, వెబ్‌డెస్క్: షార్ట్స్ పేరుతో టిక్ టాక్ లాంటి షార్ట్ వీడియో ఫీచర్‌ను యూట్యూబ్ తమ మొబైల్ యాప్‌లో త్వరలో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరలోగా ఈ ఫీచర్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. యూట్యూబ్‌లో లైసెన్స్ ఉన్న పాటలు, మ్యూజిక్‌ను ఈ షార్ట్స్ కోసం ఉపయోగించుకునే సౌకర్యం కల్పించనున్నారు. యూట్యూబ్ మొబైల్ యాప్‌లో కొత్త ఫీడ్ ద్వారా ఈ యూట్యూబ్ షార్ట్స్ అందుబాటులోకి రానుంది.

అయితే టిక్ టాక్‌లో ప్రస్తుతం 15 నుంచి 60 సెకండ్ల వీడియో నిడివి అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ యూట్యూబ్ షార్ట్స్ లో వీడియో నిడివి ఎంత ఉంటుందనే దాని గురించి ఇంకా ఎలాంటి సమచారం తెలియరాలేదు. కేవలం మొబైల్ యాప్‌కి మాత్రమే గూగుల్ ఈ ఫీచర్‌ను తీసుకురానుంది. డెస్క్‌టాప్ యాప్‌లో ఇది ఉంటుందా లేదా అనే సమాచారం తెలియరాలేదు. ఇప్పటివరకు పెద్ద పెద్ద వీడియోలను ప్రసారం చేయగిలిగిన యూట్యూబ్… టిక్ టాక్‌కి వస్తున్న ప్రాచుర్యాన్ని చూసి ఇలాంటి ఫీచర్ ఒకటి డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. వేరే యాప్ నుంచి ఫీచర్లను ఆదర్శంగా తీసుకోవడం యూట్యూబ్‌కి కొత్తేం కాదు. గతంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, స్నాప్‌చాట్ తరహాలో స్టోరీస్ అప్‌డేట్ చేసే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. అయితే కేవలం పది వేల సబ్‌స్క్రైబర్లు దాటిన క్రియేటర్లు మాత్రమే ఈ స్టోరీలను అప్‌డేట్ చేసే షరతు విధించింది. కానీ స్నాప్‌చాట్, ఫేస్‌బుక్ మాదిరిగా ఒకరోజు కాకుండా యూట్యూబ్ స్టేటస్ వారం రోజుల గడువు పాటు ఉంటుంది.

Tags: Youtube, Tik Tok, Desktop app, Shorts, video

Next Story