యూట్యూబ్ వర్సెస్ టిక్‌టాక్ వార్ : కొత్త అప్‌డేట్

by  |
యూట్యూబ్ వర్సెస్ టిక్‌టాక్ వార్ : కొత్త అప్‌డేట్
X

టిక్‌టాక్ క్రియేటర్లకు, యూట్యూబ్ క్రియేటర్లకు మధ్య వార్ నడుస్తోందని ఇటీవల దిశలో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఆ వార్‌లో ఇప్పుడొక చిన్న ట్విస్ట్ చోటుచేసుకుంది. టిక్‌టాక్ క్రియేటర్ ఆమిర్ సిద్ధిఖీని రోస్ట్ చేస్తూ యూట్యూబర్ కేరీ మినాటి పెట్టిన వీడియోను యూట్యూబ్ డిలీట్ చేసింది. దాదాపు 50 మిలియన్ల వీక్షణలు సంపాదించి ఒక్కరోజులోనే విపరీతంగా పాపులర్ అయిన ఈ వీడియోపై టిక్‌టాక్‌కు మద్దతు పలికే వాళ్లందరూ రిపోర్ట్ చేశారు. దీంతో తమ షరతులను ఉల్లఘించిన కారణాన ఈ వీడియోను యూట్యూబ్ డిలీట్ చేసింది.

అయితే యూట్యూబ్ చేసిన ఈ పనికి తోటి యూట్యూబర్లు, కేరీ మినాటీ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ‘కేరీ మినాటీ, జస్టిస్ ఫర్ కేరీ మినాటీ’ పేరుతో హ్యాష్‌ట్యాగులు ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాకుండా ఆ డిలీట్ చేసిన వీడియోలో కేరీ చెప్పిన ఒక మాటను కూడా తీవ్రంగా వైరల్ చేస్తున్నారు. కరోనా వైరస్, టిక్ టాక్ రెండూ చైనా నుంచి వచ్చి దేశాన్ని నాశనం చేస్తున్నాయని కేరీ మినాటి అందులో అన్నాడు. దీన్ని ఆసరాగా చేసుకుని కేరీ మినాటి అభిమానులు ‘బ్యాన్ టిక్‌టాక్’ అంటూ ప్రచారాలు చేస్తున్నారు. అయితే వీడియోలో కేరీ తప్పుడు మాటలు, అసభ్య పదజాలం వాడినందుకే ఇలా జరిగిందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed