సూర్యాపేటలో కలకలం.. వాట్సప్‌ స్టేటస్‌లో లవర్ నగ్న వీడియో.. ఆ తర్వాత..

523

దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల కాలంలో అమ్మాయిలను ప్రేమ పేరుతో వేధించి దారుణాలకు ఒడిగడుతున్న కేసులు పెరుగుతున్నాయి. మొదట ప్రేమిస్తున్నానంటూ వెంటపడి.. శరీరకంగా ఒక్కటై.. తీరా అవసరం తీరాక ముఖం చాటేస్తున్నారు. అనంతరం వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. తాము చెప్పింది చేయకపోతే అప్పటి పర్సనల్ వీడియో, నగ్న చిత్రాలు బయటపెడతామంటూ భయానికి గురిచేస్తున్న ఘటనలో ఎన్నో చూశాం.

తాజాగా ఇలాంటి ఘటనే సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హుజూర్‌నగర్‌ మండలంలోని శ్రీనివాసపురానికి చెందిన దళిత బాలిక ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. అయితే, అదే గ్రామానికి చెందిన జింకల మహేష్ అనే యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అది నమ్మిన బాధితురాలు.. అతడికి దగ్గరైంది. ఈ క్రమంలో గడిచిన రెండేళ్లలో వారు శారీరకంగా ఎన్నోసార్లు కలిసినట్టు బాలిక పేర్కొంది. ఈ క్రమంలోనే నాలుగు నెలల క్రితం బాలికకు వీడియో కాల్‌ చేసి నగ్నంగా కనిపించాలని కోరటంతో ఆమె అలాగే చేసింది. ఆ వీడియో కాల్‌ను మహేశ్‌ సేవ్‌ చేసి పెట్టుకున్నాడు.

ఇదిలా ఉండగా ఇటీవలే వారి మధ్య కొన్ని గొడవలు జరగడం.. తాను చెప్పినప్పుడు తనవద్దకు రావాలని.. మహేష్ కోరడంతో బాధితురాలు ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహించిన మహేష్.. బాలిక నగ్న వీడియోను తన వాట్సప్‌ స్టేటస్‌లో పెట్టాడు. దీంతో ఆ వీడియో చూసిన స్థానికులు సదరు బాలికకు విషయం చెప్పడంతో ఒక్కసారిగా షాకైంది. వెంటనే వీడియో విషయాన్ని తన పేరెంట్స్ చెప్పింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబంలో మహేష్ ఇంటికి వెళ్లగా వారు ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్లినట్టు తెలిసింది. మహేష్ సైతం పరారీలో ఉన్నాడు. దిక్కుతోచని స్థితిలో మరుసటి రోజు బాధిత బాలిక, ఆమె కుటుంబసభ్యులు జరిగిన ఘటనపై హుజూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. మహేశ్‌పై పోలీసులు అట్రాసిటీ, అత్యాచారం, ఐటీ, పోక్సో చట్టం కింద కేసులు నమోదుచేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు.