నీటి సంపులో పడి యువకుడు దుర్మరణం

by  |
died1
X

దిశ, కొందుర్గు: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం పర్వతాపూర్ గ్రామంలో 30 ఏళ్ల యువకుడు నీటి సంపులో పడి దుర్మరణం పాలయ్యాడు. పర్వతాపూర్ గ్రామంలో మిద్దె పరుశురాం ఇంటిముందు తవ్వించిన నీళ్ల సంపులో పడి రాజు అనే అదే గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. ఇంటి ముందు తవ్వించిన సంపు వద్ద జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదవశాత్తు రాజు సంపులో పడ్డట్టు గ్రామస్తులు తెలిపారు. సంపు చిన్నగా ఉండి ఎక్కువ లోతు ఉండడంతో అందులో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు వదిలినట్టు గ్రామస్తులు తెలిపారు. రాజు చనిపోవడంతో గ్రామస్తులు కంటతడిపెట్టారు.

Next Story

Most Viewed