Virtual sex : పాండమిక్‌లో వర్చువల్ సెక్స్

by  |
Online-Relations
X

దిశ, ఫీచర్స్: జనరేషన్ మారింది.. మారుతోంది. రొమాన్స్, డేటింగ్ అన్నీ నార్మల్ అయిపోయాయి. సెక్స్ విషయంలో ‘యూజ్ అండ్ గో’ కాన్సెప్ట్‌ ఫాలో అయిపోతున్నారు. టీనేజ్‌లోకి ఇలా ఎంటర్ అవుతున్నారో లేదో అలా అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేసేస్తున్నారు. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో సాగిపోతున్న డేటింగ్‌ రిలేషన్‌షిప్స్‌కు పాండమిక్ బ్రేక్ వేసింది. పార్టనర్ ప్రజెన్స్‌ను మిస్ చేసి వర్చువల్ టచ్ కోరుకునేలా చేసింది. గతేడాది ఈ ఎఫెక్ట్‌తో విరహవేదన అనుభవించిన యంగ్ అడల్ట్స్.. దూరంగా ఉంటూనే ఎలా డేట్ చేయాలో రీసెర్చ్ చేసి, చివరకు ఓ కొత్త కాన్సెప్ట్‌తో రిలాక్సేషన్ పొందారు. వీడియో చాట్స్, ఫోన్ సెక్స్, లైవ్ స్ట్రీమ్స్ ద్వారా.. మిస్సింగ్ అనే ఫీలింగ్‌ను ఫుల్‌ఫిల్ చేసుకుంటూ ఆన్‌లైన్ సెక్స్ రెవల్యూషన్‌కు తెరతీశారు. శారీరక సాన్నిహిత్యానికి బదులుగా ‘వర్చువల్ ఇంటిమసీ’ వైపు మొగ్గుచూపుతున్న యూత్.. ఎలాగూ ‘కరోనా థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్, డెల్టా’ అంటూ ఫ్యూచర్ మొత్తం ఇంటికే పరిమితం కావాలి కాబట్టి ఫ్యూచర్ డేటింగ్ స్టైల్.. ‘వర్చువల్ సెక్స్‌’కు ప్రయారిటీ ఇస్తున్నారు.

డేటింగ్ – వన్ నైట్ స్టాండ్..

యూత్‌లో డేటింగ్‌ కాన్సెప్ట్ సాధారణం అయిపోయింది. లైఫ్‌లాంగ్ తోడుండాల్సిన పార్టనర్‌ను ఎంచుకునేందుకు కొన్నేళ్లు డేట్ చేశాక.. రైటా రాంగా? అని డిసైడ్ చేసుకుని ముందుకు సాగుతున్నారు. ఈ విషయంలో అబ్బాయిలు, అమ్మాయిల ఆలోచన ఒకేవిధంగా ఉంటోంది. ఈ క్రమంలో ఎమోషనల్ బాండింగ్ ఏర్పడితే పెళ్లి.. లేదంటే మళ్లీ ఎవరి లైఫ్‌లో వారు మూవ్ ఆన్ అయిపోవడం.. మరో పార్టనర్‌ను చూజ్ చేసుకోవడం జరిగిపోతోంది. అయితే ఈ తలనొప్పంతా ఎందుకులే? అనుకునే వారు మాత్రం వన్ నైట్ స్టాండ్ ఫాలో అవుతుంటారు. అంటే ఆ ఒక్కరాత్రికి పార్టనర్ అన్న మాట.. ఆ నైట్‌ ఫిజికల్‌గా దగ్గరై ఎంజాయ్ చేశాక ఎవరిదారిన వారు వెళ్లిపోవడమే ఈ కాన్సెప్ట్. ఈ విధానంలో ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి అబ్బాయిలు మాత్రం ఈ డేటింగ్ పాలసీకి ఓకే చెప్తుంటారు.

ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్..

మనం హైటెక్ యుగంలో ఉన్నాం. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా ఫ్రెండ్‌షిప్ చేస్తున్న టైమ్ ఇది. అలాంటప్పుడు రూమ్ షేరింగ్ అనేది కూడా కామన్ అయిపోయింది. కొలిగ్స్ లేదా కాలేజ్ మేట్స్.. గర్ల్స్ బాయ్స్ అందరూ ఓ అపార్ట్‌మెంట్ తీసుకుని కలిసే ఉంటున్నారు. ఈ సమయంలో తమ ఫీలింగ్స్‌కు రెస్పెక్ట్ ఇస్తే.. ఒకరికొకరు ఫిజికల్‌గానూ దగ్గరైన సందర్భాలుంటాయి. మళ్లీ ఆ తర్వాతి రోజు నుంచి ఎప్పటిలా ఫ్రెండ్స్‌గానే లైఫ్ రీస్టార్ట్ చేసేస్తున్నారు. ఇలా ‘ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్‌’ అనే కాన్సెప్ట్‌లో ఫ్రెండ్‌షిప్‌తో పాటు సెక్సువల్‌గా కూడా లాభాలు పొందుతున్నారు.

వర్చువల్ ఇంటిమసీ..

‘డేటింగ్.. వన్ నైట్ స్టాండ్.. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్..’ ఇవన్నీ కూడా శారీరకంగా అమ్మాయిలు, అబ్బాయిలను సాన్నిహిత్యంగా ఉంచే మంత్రాలే. కానీ ప్రస్తుతం కరోనా టైమ్ నడుస్తుంది. కోట్ల మంది ప్రాణాలు తీసిన వైరస్.. జంటగా ఉండాల్సిన యూత్‌ను దూరంగా ఉండేలా చేసింది. కొందరు ఎమోషనల్‌గా బ్లాక్ అయిపోయి రిలేషన్‌షిప్ బ్రేక్ చేసుకుంటే.. మరికొందరు మాత్రం వర్చువల్ ఇంటిమసీకి మొగ్గుచూపారు. దూరంగా ఉన్నా సరే వర్చువల్‌గా దగ్గరయ్యారు. ఈ డేటింగ్ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉన్నా పాండమిక్ తర్వాతే పాపులర్ అయింది. ఫ్యూచర్‌లోనూ మరిన్ని కరోనా వేవ్స్ వచ్చే అవకాశం ఉండటంతో ప్రస్తుతం యూత్ ఈ పాలసీకి మొగ్గుచూపుతున్నారు. తాజా అధ్యయనం కూడా ఇదే రుజువు చేసింది.

లేటెస్ట్ స్టడీ ఆన్ ‘వర్చువల్ సెక్స్’..

అమెరికాకు చెందిన ప్లెంటీ ఆఫ్ ఫిష్, వన్ పోల్ సంస్థల సర్వే ప్రకారం 18-40 ఏళ్ల వయసులో ఉన్న 50 శాతానికి పైగా యూత్ వర్చువల్ సెక్స్ కోరుకుంటోంది. 2900 మంది సింగిల్స్‌ ఈ అధ్యయనంలో పాల్గొనగా.. 42 శాతం మంది పాండమిక్ తర్వాత డేటింగ్‌కు వెళ్లేందుకు మొగ్గుచూపారు. మిగిలివారు మాత్రం కరోనా సమయంలో ఆన్‌లైన్ సెక్స్ రెవల్యూషన్‌లో భాగమైనట్లు ఒప్పుకున్నారు. వీడియో చాటింగ్, సెక్స్‌టింగ్, ఫోన్ సెక్స్ ద్వారా పార్టనర్‌‌తో ఫీలింగ్స్ షేర్ చేసుకున్నారు.

కాగా ఈ పాండమిక్.. సెక్స్‌పట్ల తమ వైఖరిని మార్చిందని, అసలు భాగస్వామితో సన్నిహితంగా ఎలా ఉండాలో నేర్పిందని 64 శాతం మంది చెప్తున్నారు. దాదాపు పది మందిలో ఆరుగురు అంటే 57 శాతం మంది ఎమోషనల్, ఇంటలెక్చువల్ ఇంటిమసీకి ప్రాధాన్యతనిస్తే 45 శాతం మంది ఫిజికల్ కనెక్షన్‌కు తక్కువ విలువ ఇస్తున్నట్లు చెప్పారు. వీరిలో 61 శాతం మంది పాండమిక్ తర్వాత వర్చువల్ సెక్స్ అనేది మరింత పాపులర్ అవుతుందని నమ్ముతున్నట్టు ఈ అధ్యయనం వివరించగా.. ‘వన్ నైట్ స్టాండ్’ కాన్సెప్ట్‌కు దాదాపు తెరపడనుందని స్పష్టం చేస్తోంది. అంతేకాదు దాదాపు 51 శాతం మంది సింగిల్స్ ఇదే ఒపీనియన్‌తో ఉన్నారని స్టడీ పేర్కొంది. ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. మహిళల కన్నా పురుషులే ఈ సెంటిమెంట్‌ను ఎక్కువగా ఫాలో అవుతున్నారని, 57 శాతం మంది మిలెనియల్స్, 39 శాతం మంది జెన్ జెడ్.. ‘వన్ నైట్ స్టాండ్’ అనేది ప్రీ కొవిడ్ ట్రెండ్‌గా మిగిలిపోతుందని చెప్పింది.

పాండమిక్ టైమ్‌లో చాలా వరకు యంగ్ సింగిల్స్.. తమ సోషల్ సర్కిల్‌లో ఉన్న వ్యక్తులతోనే సాన్నిహిత్యం ఏర్పరుచుకున్నారు. వీరిలో సగం మంది(46 శాతం)కి గతంలో ‘ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్’ కాన్సెప్ట్‌లో అనుభవం ఉండగా.. 76 శాతం పాండమిక్ స్టార్ట్ అయ్యే నాటికే ఈ తరహా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు వెల్లడించారు. ఇక ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ పొందుతున్న వారిలో 39 శాతం క్రమేణా తమ బంధాన్ని అధికారికంగా బలపరుచుకోగా.. సోషల్ డిస్టెన్సింగ్, ఇతరత్రా పాండమిక్ రిలేటెడ్ పరిమితుల కారణంగా 49 శాతం మంది తమ బంధానికి ముగింపు పలికారు.

రూమ్ మేట్స్‌తో ‘ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ రిలేషన్‌షిప్‌’ అనేది ‘వర్చువల్ సెక్సువల్ ఇంటిమసీ’గా మారితే.. ఆ డేటింగ్ ట్రెండ్‌ను ‘రూమ్-మేట్-ఇంగ్’గా పిలుస్తున్నారు. ఇలాంటి వారు అడల్ట్ ఎంటర్‌టైన్మెంట్ ప్లాట్‌ఫ్లామ్స్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకోవడం ద్వారా సెక్సువల్ నీడ్స్‌ను ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నారు. పాండమిక్ నుంచి బయటపడేందుకు సిద్ధమవుతున్న సిచ్యువేషన్‌లో.. ఈ కొత్త శకానికి చెందిన సెక్స్, డేటింగ్, ఇంటిమసీ కాన్సెప్ట్ కోసం ఎదురుచూస్తున్నట్టు ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

Next Story