- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎమ్మెల్యే జోగి రమేశ్ నుంచి ప్రాణహాని.. వైసీపీ మహిళా నేత సంచలన వ్యాఖ్యలు

దిశ, ఏపీ బ్యూరో : నాకు, నా భర్తకు, పిల్లలకు పెడన ఎమ్మెల్యే జోగిరమేష్ వల్ల ప్రాణహాని ఉంది. ఎమ్మెల్యే జోగి రమేశ్ నుంచి మా కుటుంబాన్ని కాపాడాలంటూ వైసీపీకి చెందిన మహిళా నేత జక్కా లీలావతి సంచలన ఆరోపణలు చేశారు. జోగి రమేష్ వల్ల తమకు ప్రాణహాని ఉందని విలపించారు. నా భర్త కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం పడతడిక సర్పంచ్ ప్రదీప్ కుమార్ అని చెప్పుకొచ్చారు. గతంలో నాపై ,నా భర్తపై కేసులు పెట్టి వేధించారు. నా భర్తకు ఎమ్మెల్యే జోగిరమేష్ కొంతమంది వ్యక్తులు చేత మత్తుమందు ఇచ్చి తన వైపునకు తిప్పుకున్నాడని ఆమె ఆరోపించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో అనేక ఇబ్బందులు పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
గత రెండున్నరేళ్లుగా మా కుటుంబం అనధికారిక హౌస్ అరెస్ట్‌లో ఉన్నాం. రకరకాల ఫోన్ కాల్స్‌తో మమ్మల్ని చంపుతానని ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తున్నారు. సీఎం జగన్ నన్ను, నా కుటుంబాన్ని కాపాడాలి అంటూ వైసీపీ నాయకురాలు లీలావతి వేడుకున్నారు. జగనన్న మా కుటుంబానికి రక్షణ కల్పించండి. మీ చెల్లిగా నేను కోరుతున్నాను. నాకు ఒక అన్నగా రక్షణ కల్పించండి అంటూ లీలావతి విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. మరి లీలావతి ఆరోపణలపై వైసీపీ నాయకత్వం, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
- Tags
- jogi ramanna