నన్ను చంపేందుకు జార్ఖండ్ నుంచి 20 మంది.. వైసీపీ ఎంపీ సంచలనం

80
ycp flag

దిశ, ఏపీ బ్యూరో : ఓం నమ:శ్శివాయ పేరుతో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిని చంపేస్తున్నారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత తోట చంద్రయ్య హత్య అందులో భాగమేనని ఆరోపించారు. తనపై కూడా హత్యాయత్నం జరిగిందని ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. తనను అంతమెుందించేందుకు కుట్రపన్నారని అందుకు సాక్ష్యాధారాలతో సహా తన వద్ద సమాచారం ఉందన్నారు. జార్ఖండ్ నుంచి 20 మందిని తీసుకువచ్చి తనను అంతమెందించాలని కుట్రపన్నారని ఆరోపించారు. తనను ఢిల్లీ నుంచి నరసాపురం రప్పించాలంటే అనేక కేసులు పెట్టించాలని కూడా ప్లాన్ వేశారని ఆరోపించారు.

కేసులకు సంబంధించి తాను ఏపీ వస్తే హత్య చేసి దమ్మీ కేసు కింద కొట్టేసేందుకు కూడా ప్లాన్ వేశారని రఘురామ ఆరోపించారు. ఇన్ఫర్మేషన్ వచ్చిందని జూన్ 2 అర్థరాత్రి పీవీ సునీల్ కుమార్ సీఐడీ అడిషనల్ డీజీ పీవీ సునీల్ కుమార్ బండి సంజయ్ కుమార్ లేఖపై ఎలా అయితే కేంద్రం స్పందించిందో తనపై కూడా స్పందించాలి. జార్ఖండ్ నుంచి 20 మందిని తీసుకురావాలని ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తానని చెప్పుకొచ్చారు. విచారణ చేయాల్సిందిగా కోరుతాననన్నారు. అలాగే కొంతమందిపై తనకు అనుమానం ఉందని వారి పేర్లు కూడా అందులో మెన్షన్ చేస్తానని చెప్పుకొచ్చారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విషయంలో కేంద్రం ఎంత వేగంగా స్పందించిందో తన లేఖపై కూడా అంతే వేగంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు ఎంపీ రఘురామ తెలిపారు.