డ్యాన్స్‌తో దుమ్మురేపిన వైసీపీ మహిళా ఎమ్మెల్యే

by  |
డ్యాన్స్‌తో దుమ్మురేపిన వైసీపీ మహిళా ఎమ్మెల్యే
X

దిశ, ఏపీ బ్యూరో: నిత్యం ప్రజలతో, వరుస సమీక్షలతో బిజీగా ఉండే తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. ఉండవల్లి శ్రీదేవి దాండియా డ్యాన్స్‌తో దుమ్ము లేపారు. దసరా నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ బేగంపేటలోని కంట్రీ క్లబ్‌లో ఏర్పాటు చేసిన దాండియా ఉత్సవానికి ఎమ్మెల్యే శ్రీదేవి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. దాండియా నృత్యం కోసం గుజరాతి సంప్రదాయం ప్రకారం రంగు రంగులలో లెహంగా, ఛోళీ, బాందీనీ దుపట్టా గల డ్రెస్‌ను ధరించి..గాయనీగాయకులు, సంగీత వాయిద్యాల మధ్య మహిళలతో కలిసి కాసేపు డ్యాన్సులతో అదరగొట్టారు. కాసేపు ఎమ్మెల్యే హోదాను పక్కనపెట్టి వారి కుమార్తెలతో కలిసి సంప్రదాయబద్దంగా ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ.. దాండియా డ్యాన్స్ ఆడటంలో ఎంతో సంతోషంగా ఉందన్నారు. దేవీ శరన్నావరాత్రుల సందర్భంగా గుజరాతీ సంప్రదాయంలో లయబద్దమైన నృత్యాలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు.



Next Story

Most Viewed