ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసిన హీరోయిన్ యామీ గౌతమ్

by  |
ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసిన హీరోయిన్ యామీ గౌతమ్
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ యామీ గౌతమ్ పెళ్లి పీటలెక్కేసింది. ‘ఉరి : ది సర్జికల్ స్ట్రైక్’ డైరెక్టర్ ఆదిత్య ధర్‌తో అతికొద్ది మంది బంధుమిత్రుల మధ్య జూన్ 4న వివాహం చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన భామ.. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న తమను ఆశీర్వదించాలని కోరింది. కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న తాము కుటుంబసభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నామని తెలిపింది. ‘ఉరి’ సినిమాలో యమీ హీరోయిన్ కాగా ఆ సమయంలో మొదలైన ఫ్రెండ్‌షిప్.. ప్రేమ, పెళ్లికి దారితీసిందని తెలుస్తోంది. కాగా న్యూ కపుల్స్‌కు సోషల్ మీడియా వేదికగా విషెస్ అందిస్తున్నారు సెలబ్రిటీలు.

Next Story

Most Viewed