అయోధ్యకు యాదాద్రిలోని తులసీ వనం మట్టి..

by  |
అయోధ్యకు యాదాద్రిలోని తులసీ వనం మట్టి..
X

దిశ, ఆలేరు :
అయోధ్యలోని రామ జన్మ భూమిలో ఆగస్ట్ 5వ తేదీన కొత్తగా నిర్మించబోయే ఆలయానికి భూమి పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి మట్టి, నది జలాలను వినియోగించే కార్యక్రమంలో భాగంగా మంగళవారం యాదాద్రి క్షేత్రం నూతన గోశాలలోని స్వామి వారి పవిత్రమైన తులసి వనం నుంచి మట్టిని వీహెచ్‌పీ కార్యకర్తలు సేకరించారు. అనంతరం స్వామీ వారీ సన్నిధిలో ప్రత్యేక కలశ పూజలు నిర్వహించి భాగ్యనగరంలోని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ కార్యాలయానికి పంపించనున్నారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ ఉమ్మడి నల్గొండ జిల్లా సహకార్యదర్శి తోట భానుప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు పోతనాక్ రఘువెంధర్, జిల్లా సహకార్యదర్శి కర్రె ప్రవీణ్ , హిందూ వాహిణి జిల్లా అద్యక్షులు గీస ఆనంద్, బజరంగ్ దల్ జిల్లా సంయోజక్ కొకల సందీప్, భువనగిరి పట్టణ అద్యక్షులు చామ రవీందర్, భువనగిరి మండల అధ్యక్షులు సుక్కల శ్రీశైలం యాదవ్, నాగేందర్ పాల్గొనారు.

Next Story