‘యాడబోతివి కేసీఆర్’ పాటల సీడీ ఆవిష్కరణ

by  |
‘యాడబోతివి కేసీఆర్’ పాటల సీడీ ఆవిష్కరణ
X

దిశ, సంగారెడ్డి: బతుకులు మారుతాయని పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తోందని యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నారు. ‘‘యాడబోతివి కేసీఆర్’’ .. అనే పాటల సీడీని సంగారెడ్డిలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజలకు అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ, జిల్లా అధ్యక్షుడు గాలిరెడ్డి, నాగరాజూ, గాయకులు, మ్యూజిక్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed