షావోమీ వారి పారదర్శక టీవీని చూశారా?

by  |
షావోమీ వారి పారదర్శక టీవీని చూశారా?
X

ప్రపంచంలో మొదటిసారిగా పారదర్శక(transparent) టీవీని చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షావోమీ ఆవిష్కరించింది. ఇందులో ప్రసారమయ్యే బొమ్మలు గాల్లో తేలినట్లు కనిపించే ఈ టీవీకి ఎంఐ టీవీ లక్స్(mi tv lux) అని పేరుపెట్టింది. ఒక అంచు నుంచి మరో అంచు వరకు పూర్తిగా పారదర్శకమైన డిస్‌ప్లే కలిగి ఉన్న ఈ చిన్న గ్లాస్ స్క్రీన్ గుండా వీక్షకులు టీవీకి అవతలి వైపు ఉన్న వస్తువులను కూడా చూడగలరు. పారదర్శకమైన ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్ (OLD) టెక్నాలజీతో దీన్ని డిజైన్ చేశారు. సాధారణ ఎల్‌ఈడీ టీవీల్లో ఉన్న ఎల్ఈడీలకు బయటి నుంచి లైట్ అవసరమవుతుంది. కానీ ఈ ఓఎల్ఈడీ టీవీలో ఉన్న ఎల్‌ఈడీలు స్వయంగా వెలుగుతాయి. కాబట్టి ఎలాంటి బ్యాక్ లైటింగ్ అవసరం ఉండదు.

55 ఇంచుల పొడవుతో దీర్ఘచతురస్రాకారంగా ఉన్న ఈ టీవీ మందం అతి సన్నగా ఉంటుంది. దాదాపు 5.6 మిల్లీమీటర్లు మాత్రమే వెడల్పు కలిగి ఉంది. ఈ స్క్రీన్‌కు 1.07 బిలియన్ల రంగుల సమ్మేళనాలను డిస్‌ప్లే చేయగల సామర్థ్యం ఉంది. అడుగున ఒక సీడీల కట్టలాగ ఉన్న బేస్ ఉంది. కాబట్టి అన్ని రకాల సరౌండింగ్స్‌లో సెట్ అవుతుందని కంపెనీ చెబుతోంది. మొదటగా చైనాలో దీన్ని ఆగస్టు 16న విడుదల చేయబోతున్నారు. అక్కడ దీని ధర 49,999 ఆర్ఎంబీలు.. అంటే దాదాపుగా ఐదున్నర లక్షల రూపాయలు. అయితే భారత మార్కెట్‌లో ఎంత ధరతో విడుదలవుతుందో, ఎప్పుడు విడుదలవుతుందోననే సంగతి ఇంకా తెలియరాలేదు. ఇప్పటికే చైనా ఉత్పత్తులను ప్రజలు కొనడం మానేస్తున్న తరుణంలో ఇలాంటి ఆకట్టుకునే టీవీని కొనకుండా ఉండగలరా లేదా అని తెలియాలంటే వేచి చూడక తప్పదు.


Next Story

Most Viewed