చైనాలో అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీలు నిలిపివేత

by  |
చైనాలో అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీలు నిలిపివేత
X

దిశ, స్పోర్ట్స్: చైనాలో ఇకపై అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీలను నిర్వహించబోమని.. వాటిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వుమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యూటీఏ) చైర్మన్ స్టీవ్ సిమర్ గురువారం ప్రకటించారు. చైనాకు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షుయ్ గత నెల 2న అదృశ్యం అయ్యింది. చాలా రోజుల పాటు ఆమె ఆచూకి తెలియరాలేదు. చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన కీలక నేత, మాజీ వైస్ ప్రీమియర్ జాన్గవోలీ తనపై లైంగిక దాడి చేసినట్లు పెంగ్ షుయ్ సోషల్ మీడియాలో పోస్టులు చేసింది. అయితే ఆ తర్వాత డిలీట్ చేసి.. ఎవరికీ కనపడకుండా పోయింది.

చైనా ప్రభుత్వమే ఆమెను అదృశ్యం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పలువరు టెన్నిస్ క్రీడాకారిణులు ఆమె కనపడకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఒత్తడి పెరగడంతో చైనా మీడియా పెంగ్ షుయ్‌కి చెందిన ఫొటోలు విడుదల చేసింది. ఆమె క్షేమంగానే ఉన్నదని చెప్పింది. అందే కాకుండా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చీఫ్ థామస్ బాచ్‌తో వీడియో కాల్ మాట్లాడించింది. ఇంత జరిగిన తర్వాత కూడా డబ్ల్యూటీఏ ఆమె భద్రత, ఆచూకీపై అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ విషయంలో పూర్తి స్పష్టత వచ్చే వరకు చైనా, హాంకాంగ్‌లో అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.


Next Story

Most Viewed