ప్రపంచంలోనే అతిపెద్ద నీలం రాయి.. ఎక్కడో తెలుసా.?

by  |
Sri-lanka
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోనే అతిపెద్ద, విలువైన నీలం రాయి శ్రీలంకలో దొరికింది. స్థానిక అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఒక రత్నాల వ్యాపారి ఇంట్లో తవ్వకాల్లో భాగంగా ఈ రాయి బయపడినట్టు తెలుస్తోంది. కాగా దాని విలువ ఇంటర్నేషన్‌లో దాదాపు రూ.743 కోట్ల వరకు ఉంటుందని ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.

శ్రీలంకకు రత్న రాజధానిగా పేరుగాంచిన రత్నపుర ప్రాంతంలో జెమ్ ట్రేడర్ డాక్టర్ గామేజ్.. తన ఇంటి వెనకాల లేబర్స్‌‌తో బావి తవ్విస్తుండగా లేత నీలం రంగులో ఉన్న రాయి వెలుగు చూసింది. 510 గ్రాముల బరువు, 25 లక్షల క్యారట్ల విలువైన ఈ స్టోన్‌ను ‘సెరెండిపిటీ సఫైర్’గా పిలుస్తారు. అయితే దేశంలోని నియమాలు, చట్టాల ప్రకారం ఇలాంటివి దొరికితే సదరు యజమాని పరిపాలనా అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.

దీంతో గామేజ్ ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయగా.. వారు ఈ రాయిని పరిశీలించిన మీదట ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దీనికి అంటుకుని ఉన్న మట్టిని తొలగించాలంటేనే ఏడాది పడుతుందని, ఆ తర్వాతే రాయిని క్షణ్ణంగా విశ్లేషించి సర్టిఫై చేయగలమని తెలిపారు. అంతేకాదు రాయిని క్లీన్ చేసే క్రమంలో కిందపడ్డ కొన్ని రాళ్ల ముక్కలు కూడా హై గ్రేడ్‌కు చెందిన రత్నాలే అని వారు స్పష్టం చేశారు.

కాగా ప్రపంచవ్యాప్తంగా విలువైన రాళ్లను ఎగుమతి చేయడంలో శ్రీలంక ముందుంది. ఇక్కడి సముద్ర ప్రాంతంలో కనిపించే పగడాలు కూడా అద్భుతమైన నాణ్యతతో ఉంటాయి. శ్రీలంక గతేడాది డైమండ్ కట్టింగ్, రత్నాల ఎగుమతుల ద్వారానే 500 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందగా.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది బలం చేకూరుస్తోంది.


Next Story

Most Viewed