కృష్ణాష్ట‌మినాడు హిందుల‌ను ఉద్దేశించి Bangladesh ప్ర‌ధాని ఆస‌క్తిక‌ర వ్యాఖ్యాలు!

by Disha Web Desk 20 |
కృష్ణాష్ట‌మినాడు హిందుల‌ను ఉద్దేశించి Bangladesh ప్ర‌ధాని ఆస‌క్తిక‌ర వ్యాఖ్యాలు!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః దేశంలో తమను తాము మైనారిటీలుగా భావించడం మానేయాలని బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా, బంగ్లాదేశ్ హిందూ సమాజ సభ్యులను కోరారు. బంగ్లాదేశ్‌లో ప్రతి ఒక్కరికీ వారి విశ్వాసంతో సంబంధం లేకుండా సమాన హక్కులు ఉన్నాయని ఆమె అన్నారు. ఛటోగ్రామ్‌లోని జెఎం సేన్ హాల్, ఢాకాలోని ధాకేశ్వరి మందిర్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి ఆమె అధికారిక గృహమైన గణభబన్ నుండి హాజరైన సందర్భంగా ప్రధాని హాసీనా ఈ వ్యాఖ్య‌లు చేశారు. 'అన్ని మతాల ప్రజలు సమాన హక్కులతో జీవించాలని కోరుకుంటున్నాము. మీరు ఈ దేశ పౌరులైతే, మీకు ఇక్కడ పూర్తిగా సమాన హక్కులు ఉంటాయి. నాకు ఉన్న హక్కులన్నీ మీకూ ఉన్నాయి' అని ఆమె చెప్పారు. 'దయచేసి మిమ్మల్ని మీరు అణగదొక్కుకోకండి,' ఈ హామీతో ప్రజలందరూ ముందుకెళ్ల‌గ‌లిగితే, ఎలాంటి దుష్ట వర్గం అయినా స‌రే దేశ మత సామరస్యాన్ని నాశనం చేయలేద‌ని ఆమె పేర్కొన్నారు. 'ఆ నమ్మకాన్ని, ఐక్యతను మన మధ్య ఉంచుకోవాలి. మీ అందరి నుంచి ఇదే నేను ఆశిస్తుంది' అని ఆమె విజ్ఞప్తి చేశారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా, హసీనా హిందూ సమాజానికి శుభాకాంక్షలు తెలిపినట్లు బంగ్లాదేశ్ అధికారిక వార్తా సంస్థ బంగ్లాదేశ్ సంగ్‌బాద్ సంస్థ నివేదిక తెలిపింది.


Next Story

Most Viewed