- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
తుఫాన్ భీభత్సం.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు
దిశ, వెబ్‌డెస్క్: భారీ తుఫాన్ దెబ్బకి మయన్మార్‌లో 74 మంది చనిపోగా 89 మంది గల్లంతయ్యారు. యాగీ తుఫాను దెబ్బతో మయన్మార్ అతలాకుతలం అవుతోంది. చనిపోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, అలాగే గల్లంతైన వారి సంఖ్య పెరగొచ్చని ప్రభుత్వం చెబుతోంది.
కాగా.. ఇంతకుముందు కూడా మయన్మార్‌లో ఇలాంటి దుర్ఘటనలు జరిగాయి. ఇంతకుముందు టైఫూన్ యాగీ... వియత్నాం, ఉత్తర థాయిలాండ్, లావోస్‌లో విధ్వంసం సృష్టించడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. 260 మందికి పైగా మరణించారు. తప్పిపోయిన వ్యక్తులకు సంబంధించి ఈ తాజా గణాంకాలు పాలక మిలిటరీ కౌన్సిల్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్ చేసిన ప్రకటన తర్వాత వచ్చాయి.
కాగా.. బుధవారం నాడు మయన్మార్‌లోని మాండలే, బాగో, రాజధాని నైపిటావ్ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలలో వరదలు భారీ విధ్వంసం సృష్టించాయి. ఇక వరద ప్రభావిత ప్రాంతాలకు శుక్రవారం చేరుకున్న సైనిక అధికారులు.. సహాయక చర్యలు చేపడుతున్నారు. రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్ల నిర్వహణ అవసరాన్ని జనరల్ నొక్కిచెప్పారు. బాధితుల కోసం విదేశీ సహాయం కోరారు.