ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా.. బాంబులతో దాడి..

by Dishanational4 |
ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా.. బాంబులతో దాడి..
X

కీవ్: ఓ వైపు ఉక్రెయిన్ భూభాగాలను విలీనం చేసుకున్నట్లు ప్రకటిస్తూనే మరోవైపు రష్యా మిసైల్స్ దాడులు తీవ్రతరం చేసింది. శుక్రవారం ఉక్రెయిన్ నగరాలపై మిసైల్స్, రాకెట్లు, డ్రోన్లతో విరుచుపడగా 25 మంది పౌరులు మరణించారు. ఈ దాడుల్లో మరో 50 మంది మరణించినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ప్రయాణీకులతో కూడిన వాహానాలపై ఈ దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. తీవ్రతరమైన దాడుల్లో భవనాలు దెబ్బతిన్నాయి.

కాలనీలా మారాలని లేదు: పుతిన్

ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తూనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్, లుహన్స్క్, ఖేర్సాన్, జాపోరిజ్జియా నాలుగు ప్రాంతాలను రష్యాలో అధికారికంగా కలిపామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. 'మా భూమిని అన్ని విధాలా కాపాడుకుంటాం. ఇది రష్యన్ ప్రజల విముక్తి మిషన్' అని పేర్కొన్నారు.

పశ్చిమ దేశాలు రష్యాను కాలనీగా మార్చాలని చూస్తున్నాయని విమర్శించారు. 'వారు భారత్, ఆఫ్రికా, చైనాను దోచుకున్నారు. అయితే మాకు మేముగా కాలనీ మారేందుకు అనుమతించోం' అని అన్నారు. నాలుగు ప్రాంతాలు రష్యాలో చేరడంతో 15 శాతం ఉక్రెయిన్ తమలో భాగమైందని పేర్కొన్నారు. దీనిలో ఎలాంటి వెనుకడుగు ఉండబోదని తేల్చి చెప్పారు. చరిత్రపరంగా ఈ ప్రాంతాలు రష్యాలో భాగమేనని పేర్కొన్నారు.


Next Story

Most Viewed