- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Vivek Ramaswamy: 'ప్రెసిడెంట్ కాగానే ఎఫ్బీఐని మూసేస్తా'
వాషింగ్టన్ : రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్ధిత్వ రేసులో ఉన్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి సంచలన కామెంట్స్ చేశారు. తాను ప్రెసిడెంట్ అయితే ఐదు ప్రభుత్వ సంస్థలను మూసేస్తానని ప్రకటించారు. అందులో అత్యంత కీలకమైన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) కూడా ఉంది. ఎఫ్బీఐలో అత్యవసరం కాని రోల్స్‌లో ఉన్న 20వేల మంది ఉద్యోగులను తీసేసి, వారిలో 15 వేల మందికి వేరే డిపార్ట్‌మెంట్‌లలో జాబ్స్ ఇస్తానన్నారు. వాషింగ్టన్‌లోని ‘అమెరికా ఫస్ట్ పాలసీ ఇన్ స్టిట్యూట్’ లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ వివేక్ రామస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, న్యూక్లియర్ రెగ్యులేటరీ కమిషన్, బ్యూరో ఆఫ్ ఆల్కహాల్ అండ్ టొబాకో, ఫైర్ ఆర్మ్స్ అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ విభాగం, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్‌మెంట్ ను మూసేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గిస్తానని, దాదాపు 10 లక్షల మంది సిబ్బందిని తొలగిస్తానని స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే మొదటి ఏడాది నుంచే ఈ పని మొదలు పెడతానని ఆయన పేర్కొన్నారు. అధ్యక్ష రేసులో ఉన్నప్పటికీ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా తీరుపై వివేక్ ప్రశంసలు కురిపించారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లగల సమర్థుడైన ట్రంప్ లాంటి వ్యక్తికి తాను ఓటు వేయాలనుకుంటున్నానని రామస్వామి అన్నారు.