Unknown Facts : రక్తం కారుతున్న ఈ మంచు పర్వతం గురించి తెలుసా ?

by Disha Web Desk 10 |
Unknown Facts : రక్తం కారుతున్న ఈ  మంచు పర్వతం  గురించి తెలుసా ?
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ ప్రపంచంలోని ఎన్నో రహస్యాలను చాలా మంది శాస్త్రవేత్తలు ఛేదించారు. అయినా ఇప్పటికి వారికి కూడా సవాళ్లు విసిరే అంశాలు చాలానే ఉన్నాయి. ఏవో మేజిక్ కనబడే వింత అంశాలు శాస్త్రవేత్తలను ప్రశ్నిస్తున్నాయి. పురాతన కాలానికి సంభందించిన విషయాలు మనకి తెలియని కొన్ని ప్రదేశాలు వింత ప్రదేశాలుగా మిగిలిపోయాయి. అయితే ఈ భూమి మీద ఉండే ప్రదేశాలలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బ్లడ్ ఫాల్స్

ఇది చూడటానికి మంచు పర్వతం నుంచి రక్తం కారుతున్నట్టు ఉంటుంది. 1911 లో అంటార్కిటికాలో కనిపెట్టడం జరిగింది. దీనినే బ్లడ్ ఫాల్స్ కూడా అంటారు. దశాబ్దాలుగా ఇది అంతు చిక్కని రహస్యంగానే మిగిలి పోయింది. అయితే మొదటి శాస్త్రవేత్తలు ఒక వల్ల ఈ రంగు సాధ్యమైందని.. అందుకే ఎరుపు రంగు వచ్చిందని ఎదో రియాక్షన్ వల్ల వచ్చిందని అనుకున్నారు.కానీ అదంతా అబద్దమని 2015 లో తేలింది. దాదాపు ఆ మంచు తయారయ్యి 100 సంవత్సరాల పైన గడిచిన తర్వాత దాని రహస్యం బయట పడింది. ఈ మంచు కింద ఉన్న నీరు చాలా ఉప్పగా.. ఉండి అది మంచు మొత్తాన్ని ఉప్పుగా మార్చి వేసింది. ఎలాంటి వాతావరణ పరిస్తితులైన సరే ఆ మంచు అలాగే ఉండి మంచుతో ఉండిపోయింది.

లేక్ సుపీరియర్

ఉత్తరి అమెరికాలోని అతి పెద్ద సరస్సులోని లేక్ సుపీరియర్ ఒకటి. ఈ ఉపరితల వైశాన్యం ప్రకారం ప్రపంచంలోనే అతి పెద్ద మంచి నీటి సరస్సు .. ఈ మంచి నీటి సరస్సు నుంచి కొద్దీ దూరం ప్రయాణం చేసాక ఒక దగ్గర రెండుగా చీలుతుంది. మొదటిది తూర్పు వైపు వెళ్లి జలపాతంలా మారి కిందకు దూకుతుంది. పడమర వైపు వెళ్ళిన పాయ మాత్రం ఒక గుంత లోకి మాయమవుతుంది. కొద్దిగా తరచి చుస్తే కొండల మధ్య ఉన్న గుంతలో పడిపోయినట్టు కనిపిస్తుంది.


Next Story

Most Viewed