రష్యా దళాలను చుట్టిముట్టిన ఉక్రెయిన్ సైన్యం..

by Disha Web |
రష్యా దళాలను చుట్టిముట్టిన ఉక్రెయిన్ సైన్యం..
X

కీవ్: నాలుగు ఉక్రెయిన్ ప్రాంతాలను తమ భూభాగంలో చేర్చుకున్నామన్న పుతిన్ ప్రకటనల నేపథ్యంలో ఉక్రెయిన్ ఆర్మీ కీలక వ్యాఖ్యలు చేసింది. రష్యా ఆధీనంలో ఉన్న కీలకమైన పట్టణం లైమాన్ సమీపంలో తమ బలగాలు అనేక వేల మంది రష్యన్ దళాలను చుట్టుముట్టాయని ఉక్రెయిన్ సైన్యం శనివారం తెలిపింది. లైమెన్ లోని రష్యా సున్నాన్ని తాము చుట్టుముట్టామని ఉక్రెయిన్ తూర్పు దళాల ప్రతినిధి సెర్హి చెరెవతి చెప్పారు.

అంతకుముందు 5వేలకు పైగా రష్యాన్ సైన్యం ఉండగా, మిలిటరీ చర్యలతో ప్రస్తుతం ఆ సంఖ్య తగ్గిందని చెప్పారు. లైమన్ కాల్డ్రన్ లో దాదాపు 5,000 రష్యా సైన్యం అంతమైందని లుగాన్స్క్ ప్రాంత గవర్నర్ సెర్గియ్ గైడే అన్నారు. చుట్టుముట్టిన ఉక్రెయిన్ దళాలు మూడు అవకాశాలు ఇచ్చాయని పేర్కొన్నారు. పోరాడండి లేదా చావండి లేదా లొంగిపోండి అని స్పష్టం చేశారు. లైమన్ అనేది డొనెట్క్స్ ప్రాంతంలో ఉంది. శుక్రవారం రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ భూభాగంలో కలిపామని ప్రకటించిన నాలుగు ప్రాంతాల్లో ఇది కూడా ఉంది.Next Story