నల్లజాతి వ్యక్తిపై అమెరికాలో పోలీసుల దాడి.. తీవ్ర గాయాలతో బాధితుడు మృతి

by Disha Web Desk 12 |
నల్లజాతి వ్యక్తిపై అమెరికాలో పోలీసుల దాడి.. తీవ్ర గాయాలతో బాధితుడు మృతి
X

న్యూయార్క్: అమెరికాలో పోలీసులు దారుణానికి తెగబడ్డాడు. 29 ఏళ్ల నల్లజాతి వ్యక్తిని విచక్షణా రహితంగా కొట్టడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ నెల 7న ఈ ఘటన చోటు చేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా పోలీసుల పైశాచికత్వం బయటపడింది. నికోలస్ వద్దని వేడుకుంటున్న విచక్షణ రహితంగా దాడి చేసినట్లు తేలింది. అసలు విషయంలోకి వెళితే నికోలస్ అనే వ్యక్తి ఫెడెక్స్‌లో పనిచేసేవాడు.

ఈ నెల 7న నికోలస్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడని ఆరోపిస్తూ అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా కిందపడేసి ఇష్టం వచ్చినట్లు చావబాదారు. నికోలస్ బాధతో ఆర్తనాదాలు చేస్తున్నప్పటికీ వ్యంగ్యంగా నవ్వుతూ ముఖంపై పిడిగుద్దులు దిగారు. ఈ క్రమంలో తీవ్ర గాయాల పాలు కావడంతో ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ 3 రోజుల తర్వాత మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే కుమారుడి మృతిపై తల్లి అనుమానం వ్యక్తం చేసింది.

పోలీసులే అతిగా ప్రవర్తించారని ఆరోపించింది. విచారణలో ఐదుగురు పోలీసుల అతి వల్లే నికోలస్ మరణించినట్లు తేలింది. దీంతో వారిని విధుల నుంచి తప్పించడమే కాకుండా హత్యరోపణల కింద కేసు నమోదు చేశారు. తాజాగా 2020లో చోటుచేసుకున్న జార్జి ఫ్లోయిడ్ హత్య ఉదంతాన్ని గుర్తు చేసింది. తాజా ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ విచారం వ్యక్తం చేశారు. పోలీసుల ప్రవర్తన ఆగ్రహానికి గురి చేసిందన్నారు. ప్రజలు శాంతియుతంగా వ్యవహరించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.



Next Story