అక్రమ వలసదారుల పిల్లలకు పౌరసత్వ హక్కు తీసేస్తా : ట్రంప్‌

by Dishaweb |
అక్రమ వలసదారుల పిల్లలకు పౌరసత్వ హక్కు తీసేస్తా : ట్రంప్‌
X

వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. అక్రమ వలసదారులకు అమెరికాలో జన్మించే పిల్లలకు లభించే పౌరసత్వ హక్కును తాను మళ్ళీ ప్రెసిడెంట్ కాగానే రద్దు చేస్తానని వెల్లడించారు. ఈమేరకు ట్రంప్ కామెంట్స్ తో కూడిన ఒక వీడియోను ఆయన కుమారుడు ట్రంప్‌ జూనియర్‌ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అమెరికాలో పుట్టే వారందరికీ లభించే పౌరసత్వాన్ని 1868లో ఆ దేశ రాజ్యాంగంలోని 14వ సవరణ ద్వారా అందించారు. "నేను ఇంకోసారి ప్రెసిడెంట్ అయితే మొదటిరోజే పౌరసత్వ హక్కును రద్దు చేస్తా. అమెరికాలో పుట్టిన పిల్లల తల్లిదండ్రుల్లో కనీసం ఒకరికి అమెరికా పౌరసత్వం లేదా చట్టపరంగా అమెరికాలో నివసించే హక్కు ఉండాల్సిందే" అని ట్రంప్‌ స్పష్టం చేశారు. వాస్తవానికి 2018లో అధ్యక్షుడిగా ఉండగానే.. దీనిపై ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ జారీ చేయాలని ట్రంప్‌ భావించారు. కానీ, తర్వాత ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. వాస్తవానికి ట్రంప్ తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన అమెరికా రాజ్యాంగానికి విరుద్ధం.


Next Story

Most Viewed