హార్వర్డ్ యూనివర్సిటీ కి షాక్ ఇచ్చిన ట్రంప్.. రూ. 19,000 కోట్ల గ్రాంట్స్, కాంట్రాక్టులు నిలిపివేత

by Mahesh |
హార్వర్డ్ యూనివర్సిటీ కి షాక్ ఇచ్చిన ట్రంప్.. రూ. 19,000 కోట్ల గ్రాంట్స్, కాంట్రాక్టులు నిలిపివేత
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ట్రంప్.. రెండోసారి యూఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల ట్రంప్ తీసుకున్న టారిఫ్ నిర్ణయాలతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో అలజరడి నెలకొంది. దీంతో తీవ్ర వ్యతిరేకత రావడం తో చైనా మినహా అన్ని దేశాలపై సుంకాల పెంపు నిర్ణయాలన్ని 90 రోజుల పాటు వాయిదా వేశారు. తాజాగా ట్రంప్ హార్వర్డ్ యూనివర్సిటీపై కూడా పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. యుఎస్ పరిపాలన హార్వర్డ్ యూనివర్సిటీపై క్యాంపస్‌లో "యాంటీ-సెమిటిజం" (యూదు వ్యతిరేకత) నిర్వహణలో వైఫల్యం ఆరోపణలతో $8.7 బిలియన్ గ్రాంట్లు, $255.6 మిలియన్ కాంట్రాక్టుల సమీక్షను మార్చి 31, 2025 న ప్రకటించింది.

ఈ సమీక్షను యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్, జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహిస్తున్నాయి. హార్వర్డ్ యూనివర్సిటీలో క్యాంపస్ యాక్టివిజం నియంత్రణ, మెరిట్-బేస్డ్ అడ్మిషన్స్, డైవర్సిటీ వీక్షణల ఆడిట్ చేయాలని ట్రంప్ డిమాండ్‌ చేశారు. కాగా ఆ డిమాండ్ లను హార్వర్డ్ యూనివర్సిటీ తిరస్కరించింది. దీంతో $2.2 బిలియన్ గ్రాంట్లు, $60 మిలియన్ కాంట్రాక్టులను (రూ. 19,000 కోట్ల గ్రాంట్లు, కాంట్రాక్టులు) నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ డిమాండ్‌లు టైటిల్ VI (వివక్ష నిషేధం)ని అతిక్రమిస్తాయని హార్వర్డ్ అధ్యక్షుడు ఆలన్ గార్బర్ వాదించారు. హార్వర్డ్ ఫ్యాకల్టీ, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ రూ. 19,000 కోట్ల గ్రాంట్లు, కాంట్రాక్టులు నిలిపివేతలను సవాలు చేస్తూ బోస్టన్ ఫెడరల్ కోర్టులో దావా వేశారు.

Next Story

Most Viewed