అమెరికాలో విదేశీ విద్యార్థుల బహిష్కరణ పై వెనక్కి తగ్గిన ట్రంప్

by Mahesh |
అమెరికాలో విదేశీ విద్యార్థుల బహిష్కరణ పై వెనక్కి తగ్గిన ట్రంప్
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రజలు, ఇతర దేశాలు, అలాగే కోర్టు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేయడంతో అధ్యక్షుడు ట్రంప్‌కు వెనక్కి తగ్గారు. తాజాగా అమెరికాలో విదేశీ విద్యార్థుల బహిష్కరణ (Expulsion of foreign students)పై తీసుకున్న నిర్ణయంపై యూఎస్ వెనక్కి తగ్గింది. విద్యార్థుల చట్టబద్ధ హోదా (Legal status)ను పునరుద్ధరిస్తున్నట్లు జీవో విడుదల చేశారు. ఈ నిర్ణయంతో 1200 మంది విద్యార్థుల లీగల్‌ స్టేటస్‌ పునరుద్ధరణ (Restoration of legal status) అవ్వనుంది. కాగా గతంలో అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్న విద్యార్థులు ఆందోళనలను దిగారు. వీరంతా.. గాజా, ఇజ్రాయెల్, హమాస్ దేశాలకు చెందిన పౌరులు కావడంతో ట్రంప్ (Trump) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

కానీ ఈ నిర్ణయం ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి (Israel-Gaza War) సంబంధించిన క్యాంపస్ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై దృష్టి సారించి సారించి తీసుకుంది. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) 1,500 కంటే ఎక్కువ విద్యార్థుల వీసాలను రద్దు (Cancellation of visa) చేశారు. ఇందులో భారతీయ విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ చర్యలు "జాతీయ భద్రత" కారణాలతో జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, విశ్వవిద్యాలయాలు, విద్యార్థులు, అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ (ACLU) వంటి సంస్థలు ఈ రద్దు చట్టవిరుద్ధమని, తగిన నోటీసు లేదా సమర్థన లేకుండా జరిగాయని వాదించడంతో పాటు న్యాయస్థానాల్లో సవాళ్లు లేవనెత్తాయి. ఫలితంగా, ఒక ఫెడరల్ కోర్టు విచారణలో ICE తమ నిర్ణయాన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకుంది.



Next Story

Most Viewed