ఎన్నికల ప్రచారంలో విషాదం..స్టేజీ కుప్పకూలి 9 మంది మృతి

by samatah |
ఎన్నికల ప్రచారంలో విషాదం..స్టేజీ కుప్పకూలి 9 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: మెక్సికోలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన ఓ స్టేజీ కుప్పకూలి 9 మంది మృతి చెందగా..మరో 50 మందికి పైగా గాయపడ్డారు. శాన్ పెడ్రో గార్జా గార్షియా పట్టణంలో సిటిజన్స్ మూవ్‌మెంట్ పార్టీ సభ్యులు బహిరంగ సభ కోసం స్టేజీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో భారీగా ఈదురు గాలులు రావడంతో స్టేజీ ఒక్క సారిగా కూలిపోయింది. అక్కడ ఏర్పాటు చేసిన లైట్లన్నీ కింద ఉన్న వారిపై పడిపోయాయి. దీంతో భయబ్రాంతులకు గురైన ప్రజలు ఒక్కసారిగా పరుగులు తీయడంతో తొక్కిలాట జరిగి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆస్పతికి తరలించారు. ఈ ఘటనను న్యూవో లియోన్ గవర్నర్ శామ్యూల్ గార్సియా ధ్రువీకరించారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. తుపాను కారణంగా ప్రజలు బయటకు వెళ్లొద్దని సూచించారు. అయితే సభా వేదికపై ఉన్న సిటిజెన్స్ మూవ్ మెంట్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జార్జ్ అల్వారెజ్ మేనెజ్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన తర్వాత అన్ని ప్రచార కార్యకలాపాలను నిలిపివేస్తున్నానని, పరిస్థితిని పర్యవేక్షించడానికి రాష్ట్రంలోనే ఉంటానని అల్వారెజ్ చెప్పారు.

Next Story

Most Viewed