సంచ‌ల‌నం రేపుతున్న Donald Trump ప్రేమికుల డేటింగ్ యాప్‌! (వీడియో)

by Disha Web Desk 20 |
సంచ‌ల‌నం రేపుతున్న Donald Trump ప్రేమికుల డేటింగ్ యాప్‌! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు, రాజకీయ సలహాదారుల్లో అతి పిన్న వయస్కుడు, అంత‌కుమించి, ట్రంప్‌పై ప్రేమ‌తో ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్న జాన్ మెక్‌ఎంటీ ప్ర‌త్యేకంగా వార్త‌ల్లో నిలిచాడు. అమెరికా ట్రంప్‌ల్యాండ్‌లో ప్రేమ కోసం వెతుకుతున్న యువ రైట్ వింగ్ అభిమానుల‌ కోసం ది రైట్ స్టఫ్ అనే డేటింగ్ యాప్‌ను అభివృద్ధి చేశాడు. టెక్ బిలియనీర్ పీటర్ థీల్ నుండి $1.5 మిలియన్ల సీడ్ మనీతో ఇది అధికారికంగా వచ్చే నెలలో ప్రారంభించబడుతున్న‌ట్లు నివేదిక‌లు పేర్కొంటున్నాయి. కాగా, మాజీ ట్రంప్ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సోదరి రైయ‌న్ మెక్‌నానీ, అలాగే, ఫాక్స్ న్యూస్ కంట్రిబ్యూటర్ కైలీ మెక్‌నానీ YouTube వీడియోలో ఈ డేటింగ్ యాప్ ఎలా పనిచేస్తుందో వివరించారు. "ప్రపంచాన్ని మన మార్గంలో చూడని వ్యక్తులతో మీరు సంవత్సరాల తరబడి బ్యాడ్ డేటింగ్‌ల‌తో సమయాన్ని వృధా చేయవలసి వచ్చింది. ఇప్పుడు సరైన మార్గం మ‌న ముందు ఉంది" అని ప్ర‌చార వీడియోలో పేర్కొన్నారు.

Next Story