- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఒక్కరోజులోనే 15 గిన్నిస్ రికార్డులు నెలకొల్పిన వ్యక్తి.. అతను ఎవరు..?
దిశ, వెబ్‌డెస్క్ : సీరియల్ రికార్డ్ బ్రేకర్ గా పిలువబడే US కు చెందిన ఓ వ్యక్తి చరిత్ర సృష్టించాడు. అతను ఒకే రోజులో 15 గిన్నిస్ ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. అతనెవరో కాదు యుఎస్‌లోని ఇడాహోకు చెందిన డేవిడ్ రష్. ఒకటి కాదు.. పది కాదు.. ఏకంగా 15 గిన్నిస్ రికార్డులను ఒకే రోజు సొంతం చేసుకున్నాడు.డేవిడ్ రష్ ఇప్పటి వరకు 250కు పైగా ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. అయితే డేవిడ్ రష్, ప్రస్తుతం తన వద్ద ఉన్న 180 శీర్షికలను వేలం వేయడానికి ఇటీవలే లండన్‌లోని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్ళాడు. అతను ఒక్క రోజులోనే అనేక రికార్డులను బద్దలు కొట్టడం ఆశ్చర్యకరంగా ఉందని గిన్నిస్ వరల్డ్ రికార్డు (GWR ) అధికారిక న్యాయనిర్ణేత విల్ సిండెన్ పేర్కొన్నారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డు (GWR )ప్రకారం, డేవిడ్ రష్ మొదట గారడి విద్య నేర్చుకున్నాడు .మూడు ఆపిల్స్ ఒక నిమిషంలో నోటితో తింటూ రికార్డు నెలకొల్పాడు. అతను తన నైపుణ్యాన్ని ఉపయోగించి టేబుల్ టెన్నిస్ బంతిని రెండు బాటిల్ క్యాప్స్‌పై పదిసార్లు ప్రత్యామ్నాయ చేతులతో బౌన్స్ చేశాడు. అతను కేవలం 2.09 సెకన్లలో ఈ ఫీట్‌ను సాధించడం విశేషం . అలాగే కేవలం 30 సెకన్లలో ఎక్కువ T-షర్టులు ధరించిన వ్యక్తిగా , అత్యంత తక్కువ సమయంలో స్ట్రా ద్వారా ఒక లీటరు నిమ్మరసాన్ని తాగిన వ్యక్తిగా డేవిడ్ రష్ రికార్డులు సృష్టించాడు. ఇవేకాక మొత్తం 250 గిన్నిస్ వరల్డ్ రికార్డులు అతని ఖాతాలో ఉన్నాయి. ఇతను ప్రజలను ఆకట్టుకునే అనేక ప్రదర్శనలు చేశాడు.