30 ఏళ్ల త‌ర్వాత రిలీజ్ చేసిన స్ప‌ష్ట‌మైన UFO ఫొటో.. అంటే వాళ్లు ఉన్న‌ట్లేగా..?!

by Disha Web Desk 20 |
30 ఏళ్ల త‌ర్వాత రిలీజ్ చేసిన స్ప‌ష్ట‌మైన UFO ఫొటో.. అంటే వాళ్లు ఉన్న‌ట్లేగా..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ప్రపంచంలో అత్యంత స్పష్టమైన UFOగా చెప్పుకునే 'ది కాల్విన్ ఫోటో' 30 సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు విడుదలైంది. ఈ ఫొటోను స్కాటిష్ హైలాండ్స్‌లోని ఇద్దరు హైకర్లు తీశారు. ఇదొక అన్ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్ (UFO) ఫొటో అని పేర్కొంటూ, 1990 ఆగష్టు 4న చిత్రీకరించిన దీన్ని ఇటీవ‌ల స్కాట్లాండ్ డైలీ రికార్డ్ వార్తాపత్రికకు అందజేయ‌గా, చివరికి, ఇది దేశ రక్షణ మంత్రిత్వ శాఖ (MoD)కి చేరింది. అయితే, ఈ ఫొటో ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో లేదని నివేదికలు పేర్కొన్నాయి. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఈ ఫొటోలో ఒక పెద్ద డైమండ్ ఆకారంలో ఉన్న వస్తువు ఆకాశంలో కనిపిస్తుంది. దీన్ని UFOగా గుర్తించారు. అలాగే, దీన్ని "ప్రపంచపు అత్యుత్తమ" UFO చిత్రంగా అభివర్ణించారు.

విద్యావేత్త, జర్నలిస్ట్ డాక్టర్ డేవిడ్ క్లార్క్ ఎన్నో సంవత్సరాల పరిశోధన తర్వాత ఇది కనుగొన్న‌ట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే, ఈ ఫొటో ఇంత‌వ‌ర‌కూ ఎందుకు పబ్లిక్‌లోకి రాలేదనే సమాచారం మాత్రం తెలియ‌రాలేదు. భూమిపై ఉన్న ప్రజలు సౌర వ్యవస్థలో గ్రహాంతర జీవితం ఉంద‌ని, తీవ్రంగా ప‌రిశోధిస్తున్నారు. ఈ క్ర‌మంలో UFOలు, గ్రహాంతరవాసుల ఉనికి, వాళ్లను చూశామ‌నే వ‌దంతులు, అపోహలు, అనేక వాదాలు, ప్రతివాదాలు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు, ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఇక‌, ఇటీవల, NASA అధికారికంగా UFOల వేటలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. జూన్‌లో నాసా అన్ఐడెంటిఫైడ్‌ వైమానిక దృగ్విషయాలను పరిశీలించడానికి ప్రముఖ శాస్త్రవేత్తలను నియమిస్తూ, కొత్త అధ్యయనాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా ప్ర‌స్తుతం వెలువ‌డిని 'ది కాల్విన్ ఫోటో', నాసా మొద‌లుపెట్టిన కొత్త అధ్య‌య‌నంతో గ్ర‌హాంత‌ర‌వాసులు ఉనికి నిజ‌మేన‌నే అభిప్రాయాలు వెలువ‌డుతున్నాయి.

Next Story