ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. రష్యాలో అత్యవసర ల్యాండింగ్

by Disha Web Desk 1 |
ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. రష్యాలో అత్యవసర ల్యాండింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్తున్న ఎయిరిండియా విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో రష్యాలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దాదాపు 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బందితో ఉన్న విమానం రష్యాలోని మగడాన్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానాన్ని నేలపై నిలిపి సాంకేతిక లోపాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని ఎయిరిండియా యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు వీలైనంత సపోర్ట్ అందజేస్తున్నామని, ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గలను ముమ్మరం చేశామని ఎయిరిండియా తెలిపింది.

Next Story

Most Viewed