మహిళలకు మరో కొత్త రూల్.. అప్పుడూ కనిపించకూడదంటూ..

by Dishafeatures2 |
మహిళలకు మరో కొత్త రూల్.. అప్పుడూ కనిపించకూడదంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘనిస్తాన్ మహిళల పరిస్థితి రోజురోజుకు దీనావస్థకు చేరుకుంటుంది. రోజుకో కొత్త నిబంధనతో తాలిబన్లు స్త్రీ స్వేచ్ఛను కాలరాస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్త్రీలను అన్ని రంగాల నుంచి బహిష్కరించిన తాలిబన్లు ఆ తర్వాత విద్యను కూడా లాక్కున్నారు. తాజాగా విదేశాల ఒత్తిడితో మహిళలకు కొన్ని పరిమితులతో కొంత స్వేచ్ఛను అందించారు. కానీ తాజాగా ఆఫ్ఘన్ మహిళలకు మరో కొత్త రూల్ వచ్చింది. ఇది ముఖ్యంగా టీవీ ఛానెల్స్‌లో పనిచేసేవారికి. ఇదివరకే మహిళలు ఇంటి నుంచి బయటకు వచ్చే సమయాల్లో తమ ముఖాన్ని కప్పుకోవాలని చెప్పిన తాలిబన్లు ఇప్పుడు టీవీల్లో కనిపించే సమయాల్లో కూడా వారు ముఖాన్ని కప్పే ఉంచుకోవాలని తెలిపారు. ఈ విషయంపై తాలిబన్ల ప్రతినిధి అకిఫ్ మహజర్ మాట్లాడుతూ.. ఈ విషయాన్ని మీడియా అధికారులతో చర్చించాము. వారు ఈ నిబంధనను ఎంతో ఆనందంగా ఆహ్వానిస్తామన్నారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.


Next Story

Most Viewed