మహిళలను చదర గొట్టేందుకు కాల్పులు జరిపిన తాలిబన్లు..

by Dishafeatures2 |
మహిళలను చదర గొట్టేందుకు కాల్పులు జరిపిన తాలిబన్లు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘనిస్తాన్ దేశం తాలిబన్ల హస్తగతం అయినప్పటి నుంచి అక్కడి మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. అన్ని రంగాల్లో మహిళలకు స్థానం లేదని తాలిబన్లు కఠినంగా వ్యవహరిస్తున్నారు. దాంతో తమ ప్రాణాలకు తెగించి మహిళలు తమ హక్కులు తమకు ఇవ్వమని ఉద్యమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పని, ఆహారం కొరతపై నిరసనలు తెలుపుతున్నారు. వాటితో పాటుగా దేశంలో మహిళలను పని, రాజకీయాల్లో పాల్గొనే హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'బ్రెడ్, పని, స్వతంత్రం' నినాదాలు చేస్తూ కాబుల్‌లోని విద్య మంత్రిత్వశాఖ భవనం ఎదురు భారీ ఎత్తున నిరసనలు చేశారు. దాంతో వారిని చెదరగొట్టేందుకు అక్కడ ఉన్న తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అంతేకాకుండా కాల్పుల దెబ్బకు పారిపోయి దగ్గర దుకాణాల్లో తలదాచుకున్న మహిళలను గన్నుల వెనుక భాగంతో దారుణంగా కొట్టారు. అంతేకాకుండా ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల పాలన ప్రారంభమై సంవత్సరం కావస్తుండగా నిరసన కారులు 'ఆగస్టు 15 ఓ బ్లాక్ డే' అన్న పోస్టర్లను ప్రదర్శించారు.


Next Story

Most Viewed