'పెట్రోల్ లేదు.. ఎవరూ బంక్ దగ్గరకు రాకండి'

by Disha Web |
పెట్రోల్ లేదు.. ఎవరూ బంక్ దగ్గరకు రాకండి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం శ్రీలంక పరిస్థితి దయనీయంగా ఉంది. ఆర్థిక పరిస్థితులు బాగాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం శ్రీలంకలో పెట్రోల్ నిల్వలతో పాటు డాలర్ల కొరత కూడా తీవ్రంగా ఏర్పడింది. పెట్రోల్ నౌకలు మన తీరంలో ఉన్నాయి. కానీ, పెట్రోల్ కొనలేకపోతున్నామని శ్రీలంక ప్రభుత్వం ఆవేదన చెందుతోంది. అంతేగాక, గతంలో దిగుమతి చేసిన పెట్రోల్‌ డబ్బులు కూడా 5.3 కోట్ల డాలర్లు కట్టాల్సి ఉందని ఇంధన మంత్రి కంచన విజెశేకర తెలిపారు. తర్వలో మొత్తం బాకీ కట్టేస్తామని అన్నారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు సెంట్రల్‌ బ్యాంకు రూ.16 కోట్ల డాలర్ల శ్రీలంకకు ఇస్తున్నట్లు వెల్లడించారు. రెండు మూడు రోజులో పెట్రోల్ కొంటామని అప్పటీ వరకు ఎవరు పెట్రోల్ బంక్ దగ్గరకి రావొద్దని కంచన విజెశేకర కోరారు. అలాగే, ఇలా చెప్పుతునందుకు మమ్మల్ని క్షేమించడని అన్నారు.


Next Story